Breaking News

నిప్పులు చెరిగిన నసీం షా.. తిప్పేసిన అబ్రార్‌.. కుప్పకూలిన శ్రీలంక

Published on Mon, 07/24/2023 - 15:45

కొలొంబోలోని సింహలీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ వేదికగా శ్రీలంకతో ఇవాళ (జులై 24) మొదలైన రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ పైచేయి సాధించింది. పేసర్లు నసీం షా (3/41), షాహీన్‌ అఫ్రిది (1/44) నిప్పులు చెరగగా.. స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ (4/69) మాయాజాలం చేయడంలో పాక్‌ శ్రీలంకను తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకే కుప్పకూల్చింది.

పాక్‌ ఆటగాడు మసూద్‌ అద్భుతంగా ఫీల్డింగ్‌ చేయడంతో ఇద్దరు లంక బ్యాటర్లు రనౌట్‌ రూపంలో వెనుదిరిగారు. ఓపెనర్‌ నిషాన్‌ మధుష్క (4), ప్రభాత్‌ జయసూర్యలను (1) మసూద్‌ రనౌట్‌ చేశాడు. పాక్‌ బౌలర్ల ధాటికి లంక ఆటగాళ్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టగా.. ధనంజయ డిసిల్వ (57) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. ఇతనితో పాటు కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నే (17), దినేశ్‌ చండీమల్‌ (34), రమేశ్‌ మెండిస్‌ (27) మాత్రమే రెండంకెల స్కోర్‌లు చేశారు. 

కాగా, ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన తొలి టెస్ట్‌లో ఆతిధ్య పాక్‌ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో సౌద్‌ షకీల్‌ (208 నాటౌట్‌, 30) చెలరేగిపోవడంతో పాక్‌ 4 వికెట్ల తేడాతో గెలపొందింది.

ధనంజయ డిసిల్వ (122) సెంచరీతో కదం తొక్కడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులు చేయగా.. సౌద్‌ షకీల్‌ రెచ్చిపోవడంతో పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 461 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 279 పరుగులకు ఆలౌటైతే.. పాక్‌ 6 వికెట్లు కోల్పోయి లంక నిర్ధేశించిన 133 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇమామ్‌ ఉల్‌ హాక్‌ (50 నాటౌట్‌).. సౌద్‌ షకీల్‌ సాయంతో పాక్‌ను విజయతీరాలకు చేర్చాడు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)