Breaking News

ధవన్‌, రబాడలను ఊరిస్తున్న భారీ రికార్డులు

Published on Sun, 05/22/2022 - 15:22

ఐపీఎల్ 2022 సీజన్‌ ఇవాళ (మే 22) చిట్టచివరి లీగ్‌ మ్యాచ్‌ జరుగనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా సన్‌రైజర్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు తలపడనున్నాయి. ప్లే ఆఫ్స్‌ బెర్తులు ఖరారై, సన్‌రైజర్స్‌, పంజాబ్‌ జట్లు ఇదివరకే రేసు నుంచి నిష్క్రమించడంతో ఈ మ్యాచ్‌ నామమాత్రంగా సాగనుంది. 

రికార్డులు ఎలా ఉన్నాయంటే..
క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో పంజాబ్‌పై సన్‌రైజర్స్‌ పూర్తి ఆధిక్యాన్ని కలిగి ఉంది. ఇరు జట్ల మధ్య జరిగిన 19 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌ 13, పంజాబ్‌ 6 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ప్రస్తుత సీజన్‌ తొలి అర్ధ భాగంలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా సన్‌రైజర్స్‌ తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 7 వికెట్ల తేడాతో పంజాబ్‌ను మట్టికరిపించింది.

నేటి మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డులు ఇవే..
- పంజాబ్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ ఈ మ్యాచ్‌లో మరో బౌండరీ సాధిస్తే ఐపీఎల్‌ చరిత్రలో 700 బౌండరీల మార్కును అందుకున్న తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. అలాగే నేటి మ్యాచ్‌లో ధవన్‌  5 బౌండరీలు బాధితే పంజాబ్‌ తరఫున 50 బౌండరీలు పూర్తి చేసుకుంటాడు. 

- పంజాబ్‌ పేసర్‌ రబాడ నేటి మ్యాచ్‌లో మరో 2 వికెట్లు పడగొడితే క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో 100 వికెట్ల అరుదైన మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా ఐపీఎల్‌లో 100 వికెట్లు సాధించిన తొలి సౌతాఫ్రికా బౌలర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు.

- పంజాబ్‌ బౌలర్‌ రాహుల్‌ చాహర్‌ మరో 2 వికెట్లు తీస్తే టీ20ల్లో 100 వికెట్ల మార్కును చేరుకుంటాడు.

- పంజాబ్‌ హిట్టర్‌ లివింగ్‌స్టోన్‌ మరో 2 పరుగులు చేస్తే పొట్టి క్రికెట్‌లో 4500 పరుగుల మార్కును క్రాస్‌ చేస్తాడు.

- సన్‌రైజర్స్‌ డాషింగ్‌ బ్యాటర్‌ రాహుల్‌ త్రిపాఠి మరో 3 బౌండరీలు బాధితే టీ20ల్లో 250 బౌండరీల మార్కును, అలాగే మరో 4 సిక్సర్లు కొడితే 100 సిక్సర్ల క్లబ్‌లో చేరతాడు.

- పంజాబ్‌ సారధి మయాంక్‌ అగర్వాల్‌ మరో 3 సిక్సర్లు బాధితే టీ20ల్లో 150 సిక్సర్ల అరుదైన క్లబ్‌లో చేరతాడు. అలాగే మయాంక్‌ నేటి మ్యాచ్‌లో మరో 6 ఫోర్లు కొడితే ఐపీఎల్‌లో పంజాబ్‌ తరఫున 150 బౌండరీలను పూర్తి చేసుకుంటాడు.

- సన్‌రైజర్స్‌ ప్లేయర్‌ నికోలస్‌ పూరన్‌ మరో 6 బౌండరీలు సాధిస్తే టీ20ల్లో 300 బౌండరీల మార్కును అందుకుంటాడు.

- సన్‌రైజర్స్‌ బౌలర్‌ శ్రేయస్‌ గోపాల్‌ మరో వికెట్‌ పడగొడితే ఐపీఎల్‌లో 50 వికెట్లను పూర్తి చేసుకుంటాడు.

- సన్‌రైజర్స్‌ హిట్టర్‌ అబ్దుల్‌ సమద్‌ మరో 4 సిక్సర్లు కొడితే టీ20ల్లో 50 సిక్సర్ల క్లబ్‌లో చేరతాడు.
చదవండి: సన్‌రైజర్స్‌తో తలపడనున్న పంజాబ్‌.. ఆరెంజ్‌ ఆర్మీ కెప్టెన్‌ ఎవరంటే..!

Videos

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

ప్లాప్ సినిమాకు ఎందుకంత బిల్డప్ : Perni Nani

జగన్ హయాంలో స్కాం జరగలేదని స్పష్టంగా తెలుస్తుంది: పోతిన మహేష్

తెలంగాణలో అసలైన పొలిటికల్ దెయ్యం ఎవరు..?

వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్

YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

హైదరాబాద్ లో ఉల్లి కొరత?

పవన్ కళ్యాణ్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్

Photos

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)