Breaking News

కావ్య మారన్ సంచలన నిర్ణయం..

Published on Tue, 11/04/2025 - 14:56

ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం సన్ గ్రూప్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ది హండ్రెడ్ లీగ్ ఫ్రాంచైజీ నార్తర్న్ సూపర్‌చార్జర్స్ పేరును సన్‌రైజర్స్ లీడ్స్‌గా  (Sunrisers Leeds) గా మార్చాలని సన్ గ్రూప్ నిర్ణయించింది. ఐపీఎల్‌, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లలో ఫ్రాంచైజీలు కలిగి ఉన్న సన్‌గ్రూప్‌.. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌కు చెందిన ది హండ్రెడ్ లీగ్‌లో కూడా అడుగుపెట్టింది. 

నార్తర్న్ సూపర్‌చార్జర్స్ ఫ్రాంచైజీని కావ్యా మారన్ కొనుగోలు చేసింది. అయితే తొలుత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు  (ECB) కేవలం 49% వాటాను మాత్రమే సన్ గ్రూపుకు విక్రయించింది. మిగితా 51 శాతం వాటా యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ కలిగి ఉండేది. కానీ ఆ తర్వాత కావ్య మారన్ యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తో చర్చలు జరిపి మిగిలిన వాటాను కూడా కొనుగోలు చేసింది. 

దీంతో నార్తర్న్ సూపర్‌చార్జర్స్ పూర్తి వాట సన్ గ్రూప్‌కు లభించింది. ఈ క్రమంలోనే 2026 సీజన్‌కు ముందు ఫ్రాంచైజీ పేరును నార్తర్న్ సూపర్‌చార్జర్స్ నుండి సన్‌రైజర్స్ లీడ్స్ (Sunrisers Leeds) గా సన్ గ్రూపు మార్చింది.

కాగా ది హాండ్ర‌డ్ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌, లక్నో సూపర్ జెయింట్స్ (LSG) యాజ‌మాన్యాలు కూడా ఫ్రాంచైజీల‌ను క‌లిగి ఉన్నారు. ముంబై ఇండియ‌న్స్‌ ఓవల్ ఇన్విన్సిబుల్స్‌లో 49% వాటాను కొనుగోలు చేయగా.. ల‌క్నో మాంచెస్టర్ ఒరిజినల్స్‌లో 70% వాటాను కలిగి ఉంది.
చదవండి: ఆర్సీబీకి కొత్త హెడ్ కోచ్‌..

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు