Breaking News

గురి తప్పిన ఫ్రెంచ్‌ కిక్‌

Published on Thu, 07/16/2026 - 03:40

ఒకరిద్దరి మెరుపులు ప్రతీసారి ఏ జట్టుకైనా విజయం అందించవని మరోసారి నిరూపితమైంది. పక్కా ప్రణాళికతో బరిలోకి దిగితే... అడుగడుగునా సమన్వయం ప్రదర్శిస్తూ.. సమష్టిగా ముందుకు కదిలితే... ఎంతటి మేటి ప్రత్యర్థినైనా బోల్తా కొట్టించవచ్చని మళ్లీ రుజువైంది. ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో ఈసారి కచ్చితంగా ఫ్రాన్స్‌ విజేతగా నిలుస్తుందని భావించినవారందరి అంచనాలను తారుమారు చేస్తూ స్పెయిన్‌ సంచలనం సృష్టించింది. కలిసికట్టుగా కళ్లు చెదిరే ఆటతీరుతో ఫ్రాన్స్‌ ఫైనల్‌ ఆశలను సెమీఫైనల్లోనే గల్లంతు చేసిన స్పెయిన్‌... 16 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌లో టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది.  

డాలస్‌: ప్రత్యర్థి స్థాయి చూసి భయపడలేదు... లయబద్దమైన ఆటతో ప్రత్యర్థినే భయపెట్టింది... ఆరంభం నుంచి అంతం వరకు మ్యాచ్‌పై  నియంత్రణ కోల్పోలేదు... పకడ్బందీగా ఆడి  ప్రత్యర్థినే ఆద్యంతం నియంత్రించింది... తొలి క్షణం నుంచే ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌ దిశగా కదం తొక్కింది.... ప్రత్యర్థి ఆటగాళ్లను ఎక్కడికక్కడే కట్టడి కూడా చేసింది. వెరసి ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో స్పెయిన్‌ అనూహ్యంగా టైటిల్‌ ఫేవరెట్‌గా అవతరించింది. 

భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున ముగిసిన తొలి సెమీఫైనల్లో స్పెయిన్‌ 2–0 గోల్స్‌ తేడాతో ఫ్రాన్స్‌ జట్టును బోల్తా కొట్టించింది. స్పెయిన్‌ తరఫున మికెల్‌ ఒయర్‌జబాల్‌ (22వ నిమిషంలో), పెడ్రో పోరో (58వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. ఈ గెలుపుతో స్పెయిన్‌ 2010 తర్వాత ఈ మెగా ఈవెంట్‌లో మళ్లీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. అంతేకాకుండా ఓటమి లేకుండా వరుసగా 37వ మ్యాచ్‌ను ముగించింది. ఈ క్రమంలో ఇటలీ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును స్పెయిన్‌ సవరించింది. 

ఎంబాపె తడబాటు...
2018 ప్రపంచకప్‌లో టైటిల్‌ సాధించి... 2022లో రన్నరప్‌గా నిలిచి... ఈసారి మ్యాచ్‌ మ్యాచ్‌కూ రాటుదేలే ఆటతీరుతో అదరగొట్టిన ఫ్రాన్స్‌ కీలకమైన సమరంలో ఉసూరుమనిపించింది. ఏమాత్రం పోరాటపటిమ కనబర్చకుండా స్పెయిన్‌ ‘కిక్‌’ఎక్కించే ఆటకు సమాధానం ఇవ్వకుండా ఫ్రాన్స్‌ చేతులెత్తేసింది. సెమీఫైనల్‌ చేరే క్రమంలో ఫ్రాన్స్‌ కెపె్టన్‌ కిలియన్‌ ఎంబాపె 8 గోల్స్‌... మరో స్టార్‌ ఫార్వర్డ్‌ ఉస్మాన్‌ డెంబెలె 5 గోల్స్‌ చేసి సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. వీరిద్దరు సెమీఫైనల్లోనూ మెరిపిస్తారని... ఫ్రాన్స్‌ జట్టును ఫైనల్‌కు చేరుస్తారని అభిమానులు ఆశించారు. 

కానీ ఎంబాపె, డెంబెలె కీలక సమరంలో తేలిపోయారు. స్పెయిన్‌ డిఫెండర్లను దాటి ఆ జట్టు గోల్‌పోస్ట్‌ వరకు వెళ్లడంలో ఎంబాపె, డెంబెలె విఫలమయ్యారు. అడపాదడపా వచ్చిన అవకాశాలను కూడా అనుకూలంగా మల్చుకోలేకపోయారు. ఎంబాపెను నియంత్రించడంలో పూర్తిగా సఫలమైన స్పెయిన్‌ చివరకు మ్యాచ్‌ ఫలితాన్ని కూడా శాసించింది. ఆరంభం నుంచే వ్యూహాత్మకంగా ఆడిన స్పెయిన్‌ 22వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ను సంపాదించింది. ‘డి’ ఏరియాలో లమీన్‌ యామల్‌ను ఫ్రాన్స్‌ డిఫెండర్‌ లుకాస్‌ డిగ్నె మొరటుగా అడ్డుకున్నాడు.

దాంతో రిఫరీ స్పెయిన్‌కు పెనాల్టీ కిక్‌ ఇవ్వగా... మికెల్‌ ఒయర్‌జబాల్‌ బంతిని లక్ష్యానికి చేర్చి స్పెయిన్‌ను 1–0తో ఆధిక్యంలో నిలిపాడు. ఈ టోర్నీలో ఒయర్‌జబాల్‌కిది ఐదో గోల్‌ కావడం విశేషం. అనంతరం 58వ నిమిషంలో డానీ ఓల్మో అందించిన పాస్‌ను పెడ్రో గోల్‌గా మలచడంతో స్పెయిన్‌ ఆధిక్యం 2–0కు పెరిగింది. ఆలస్యంగానైనా ఫ్రాన్స్‌ పుంజుకుంటుందని, స్కోరును సమం చేస్తుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నా... స్పెయిన్‌ మాత్రం ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)