Breaking News

రియాన్‌ పరాగ్‌ మెరుపులు వృథా.. దేవధర్‌ ట్రోఫీ విజేత సౌత్‌జోన్‌ 

Published on Fri, 08/04/2023 - 10:16

దేశవాళీ జోనల్‌ వన్డే క్రికెట్‌ టోర్నీ దేవధర్‌ ట్రోఫీలో మయాంక్‌ అగర్వాల్‌ సారథ్యంలోని సౌత్‌జోన్‌ జట్టు అజేయ విజేతగా నిలిచింది. పుదుచ్చేరిలో గురువారం జరిగిన ఫైనల్లో సౌత్‌జోన్‌ 45 పరుగుల తేడాతో ఈస్ట్‌జోన్‌ జట్టును ఓడించి తొమ్మిదోసారి దేవధర్‌ ట్రోఫీని సొంతం చేసుకుంది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సౌత్‌జోన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 328 పరుగులు చేసింది. రోహన్‌ (75 బంతుల్లో 107; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. మయాంక్‌ (63; 4 ఫోర్లు), జగదీశన్‌ (54; 2 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం 329 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్‌జోన్‌ 46.1 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌటైంది.

రియాన్‌ పరాగ్‌ (95; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరిపించినా మిగతావాళ్లు రాణించడంలో విఫలమయ్యారు. సౌత్‌జోన్‌ బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ మూడు వికెట్లు తీయగా... వైశాఖ్, కౌశిక్, విద్వత్‌ రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు.  టోర్నీలో 354 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు తీసిన రియాన్‌ పరాగ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.  

చదవండి: IND vs WI: టీమిండియా బౌలర్‌ అరుదైన ఘనత.. రెండో భారత క్రికెటర్‌గా

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)