Breaking News

దక్షిణాఫ్రికా శుభారంభం 

Published on Mon, 02/09/2026 - 22:50

అహ్మదాబాద్‌: టి20 ప్రపంచ కప్‌ గత టోర్నీ రన్నరప్‌ దక్షిణాఫ్రికా ఈ సారి టోర్నీలో భారీ విజయంతో శుభారంభం చేసింది. సోమవారం గ్రూప్‌ ‘డి’లో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 57 పరుగుల తేడాతో కెనడాపై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది.

 కెపె్టన్‌ ఎయిడెన్‌ మార్క్‌రమ్‌ (32 బంతుల్లో 59; 10 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగాడు. అన్‌‡్ష పటేల్‌కు 3 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్య ఛేదనలో కెనడా పోరాటంతో ఆకట్టుకున్నా...చివరకు ఓటమి తప్పలేదు. కెనడా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసి ఓడింది. నవనీత్‌ దలివాల్‌ (49 బంతుల్లో 64; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ సాధించగా, హర్‌‡్ష ఠాకెర్‌ (29 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ఇన్‌గిడి 4 వికెట్లు పడగొట్టగా, యాన్సెన్‌కు 2 వికెట్లు దక్కాయి. 

మార్క్‌రమ్‌ ఫిఫ్టీ... 
ఓపెనర్లు మార్క్‌రమ్, డికాక్‌ (22 బంతుల్లో 25; 2 ఫోర్లు) అనుభవం లేని కెనడా బౌలర్లపై చెలరేగారు. కెపె్టన్‌ మార్క్‌రమ్‌ బౌండరీలతో వేగం పెంచాడు. దీంతో 4.3 ఓవర్లలో జట్టు స్కోరు 50కి చేరింది. డికాక్‌ వెనుదిరిగిన తర్వాత ర్యాన్‌ రికెల్టన్‌ (21 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కెపె్టన్‌తో కలిసి వేగంగా పరుగులు సాధించడంతో పదో ఓవర్‌ ముగియకముందే సఫారీ స్కోరు 100 దాటింది. మార్క్‌రమ్‌ 28 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలో మార్క్‌రమ్, రికెల్టన్, బ్రెవిస్‌ (6) అవుటయ్యారు. డేవిడ్‌ మిల్లర్‌ (23 బంతుల్లో 39 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్స్‌లు), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (19 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెరోవైపు నుంచి దూకుడుగా ఆడటంతో జట్టు స్కోరు 200 దాటింది.  

మెరిపించిన నవ్‌నీత్‌ 
దక్షిణాఫ్రికాలాంటి గట్టి ప్రత్యరి్థపై 200 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించడం ఎవరికైనా కష్టం. కెనడాలాంటి కూనకైతే అసాధ్యం! లుంగి ఇన్‌గిడి దెబ్బకు ఆరంభంలోనే ఓపెనర్లు దిల్‌ప్రీత్‌ (0), యువరాజ్‌ (12) సహా నికోలస్‌ కిర్టన్‌ (4) వికెట్లను కోల్పోయింది. పవర్‌ప్లేలోనే మొవ్వ శ్రేయస్‌ (9) కూడా అవుట్‌ కావడంతో ఏకపక్షమే అనిపించింది. అయితే నవ్‌నీత్‌ దలివాల్, హర్‌‡్ష ఠాకెర్‌ కాసేపు సఫారీ బౌలర్లకు సవాలుగా నిలిచారు. చక్కని సమన్వయంతో జట్టు స్కోరును వందకు తీసుకెళ్లారు. ఐదో వికెట్‌కు 69 పరుగులు జోడించాక హర్‌‡్ష అవుటయ్యాడు. 39 బంతుల్లో అర్ధసెంచరీ సాధించిన నవ్‌నీత్‌ ఆఖరి ఓవర్లో ని్రష్కమించాడు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)