SA Vs ENG: దక్షిణాఫ్రికా సూపర్‌...

Published on Sat, 06/22/2024 - 03:59

గ్రాస్‌ ఐలెట్‌: టి20 వరల్డ్‌ కప్‌లో దక్షిణాఫ్రికా దాదాపు సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ తో శుక్రవారం చివరి వరకు ఆసక్తికరంగా సాగిన పోరులో దక్షిణాఫ్రికా 7 పరుగుల తేడాతో నెగ్గింది. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఇప్పటికే అమెరికాను ఓడించింది. ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ముందుగా దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ డికాక్‌ (38 బంతుల్లో 65; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా, మిల్లర్‌ (28 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. 

డికాక్‌ దూకుడుతో పవర్‌ప్లేలోనే 63 పరుగులు చేసిన సఫారీ టీమ్‌ ఆ తర్వాత తడబడింది. ఇంగ్లండ్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో తర్వాతి 84 బంతుల్లో 100 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆర్చర్‌ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులే చేయగలిగింది. హ్యారీ బ్రూక్‌ (37 బంతుల్లో 53; 7 ఫోర్లు), లివింగ్‌స్టోన్‌ (17 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడినా లాభం లేకపోయింది. 

వీరిద్దరు ఐదో వికెట్‌కు 42 బంతుల్లోనే 78 పరుగులు జోడించారు. 4 ఓవర్లలో ఇంగ్లండ్‌ 46 పరుగులు చేయాల్సి ఉండగా... బార్త్‌మన్‌ ఓవర్లో ఏకంగా 21 పరుగులు వచ్చాయి. దాంతో సమీకరణం 18 బంతుల్లో 25గా మారింది. బ్రూక్, లివింగ్‌స్టోన్‌ క్రీజ్‌లో ఉండటంతో పాటు చేతిలో ఆరు వికెట్లు ఉండటంతో ఇంగ్లండ్‌ గెలిచే స్థితిలో నిలిచింది. అయితే దక్షిణాఫ్రికా బౌలర్లు రబాడ, జాన్సెన్, నోర్జే ఒక్కసారిగా ఆటను మార్చేశారు. తర్వాతి 3 ఓవర్లలో రెండు వికెట్లు తీసి 17 పరుగులే ఇచ్చారు. దాంతో ఇంగ్లండ్‌ ఓటమి ఖాయమైంది. 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)