Breaking News

టీమిండియాపై ఓవ‌రాక్ష‌న్‌.. క‌ట్ చేస్తే! ఊహించని షాకిచ్చిన ఐసీసీ

Published on Sun, 10/12/2025 - 08:02

మహిళ‌ల ప్ర‌పంచ‌క‌ప్‌-2025లో భాగంగా గురువారం భార‌త్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఓటమి త‌ప్ప‌దు అనుకున్న చోట నాడిన్ డి క్లెర్క్ అద్బుతం చేసింది. కేవ‌లం 54 బంతుల్లోనే 84 ప‌రుగులు చేసి ప్రోటీస్‌కు మ‌రుపురాని విజ‌యాన్ని అందించింది.

అయితే గెలుపు జోష్‌లో ఉన్న సౌతాఫ్రికా స్టార్ బౌలర్ నోన్కులులెకో మ్లాబాకు ఐసీసీ ఊహించని షాకిచ్చింది. త‌మ ప్ర‌వ‌ర్త‌న నియమావళిని ఉల్ల‌ఘించినందుకు గాను అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చ‌ర్య‌లు తీసుకుంది.

ఆమె మ్యాచ్ ఫీజులో ఎటువంటి కోత విధించన‌ప్ప‌టికి.. ఓ డిమెరిట్ పాయింట్ మాత్రం ఆమె ఖాతాలో చేరింది.  24 నెలల్లో ఇది ఆమెకు మొదటి డీమెరిట్ పాయింట్ కాబట్టి సౌతాఫ్రికా మెనెజ్‌మెంట్ ఎటువంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు.

అస‌లేమి జ‌రిగిందంటే?
ఈ మ్యాచ్‌లో  మ్లాబా త‌న స్పిన్ మ్యాజిక్‌తో భార‌త టాపార్డ‌ర్‌ను దెబ్బ‌తీసింది. స్మృతి మంధాన, హర్లీన్ డియోల్‌ను  వెంటవెంటనే పెవిలియన్‌కు పంపింది. అయితే 17వ ఓవర్‌లో హర్లీన్ డియోల్‌ను ఔట్‌ చేసిన తర్వాత మ్లాబా ఆమె వైపు చూస్తూ “గుడ్‌బై” అంటూ తన స్టైల్లో సెలబ్రేషన్స్ చేసింది.

ఆమె మరీ అంత దూకుడుగా వ్యవహరించికపోయినప్పటికి.. ఐసీసీ మాత్రం ఆమె ప్రవర్తను  కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఉల్లంఘనగా పరిగణించింది. ఈ క్రమంలోనే ఆమెను ఐసీసీ మందలించింది. ఈ మెగా టోర్నీలో మ్లాబా ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడి 6 వికెట్లు పడగొట్టింది.
చదవండి: BAN vs AFG: ఐదేసిన రషీద్ ఖాన్‌.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన అఫ్గాన్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)