Breaking News

సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. డేంజరస్‌ బ్యాటర్‌ రీఎంట్రీ

Published on Mon, 11/02/2026 - 17:14

సొంత‌గ‌డ్డ‌పై బంగ్లాదేశ్‌తో జ‌ర‌గ‌నున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం 15 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది. ఈ జట్టుకు టెంబా బవుమా నాయకత్వం వహించనున్నాడు. కాగా ఆసీస్‌తో టెస్టుల‌కు గాయం కార‌ణంగా దూర‌మైన స్టార్ ఓపెన‌ర్ టోనీ డి జోర్జీ పున‌రాగ‌మ‌నం చేశాడు. టోనీ తిరిగి రావ‌డంతో  డేవిడ్ బెడింగ్‌హామ్‌ను సెల‌క్ట‌ర్లు ప‌క్క‌న పెట్టేశారు. అలాగే మిడిలార్డ‌ర్‌ బ్యాటర్ జుబేర్ హమ్జా కూడా రీఎంట్రీ ఇచ్చాడు. 

ఇటీవల ఆస్ట్రేలియాపై అద్భుత ప్రదర్శన చేసిన స్టార్ ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్, స్పిన్నర్ సైమన్ హార్మర్‌లు తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. అంతేకాకుండా తొడ కండరాల గాయం నుంచి కోలుకున్న ఫాస్ట్ బౌలర్ ఆన్రిచ్ నోర్జే తిరిగి జట్టులోకి రావడం ప్రొటీస్ బౌలింగ్‌కు మరింత బలాన్నిచ్చింది. ప్రోటీస్‌ పేస్‌ విభాగంలో నోర్జేతో పాటు కగిసో రబాడా, డేన్ ప్యాటర్సన్, కార్బిన్ బాష్‌లకు చోటు దక్కింది.

కాగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను సఫారీలు 2-1 తేడాతో సొంతం చేసుకున్నారు. తొలి టెస్టులో ఓటమి పాలైనప్పటికి మిగితా రెండు మ్యాచ్‌లలో సౌతాఫ్రికా సంచలన విజయాలు నమోదు చేసింది. ఇప్పుడు అదే జోరును బంగ్లాదేశ్‌పై కూడా కొనసాగించాలని సౌతాఫ్రికా పట్టుదలతో ఉంది. ఈ రెండు టెస్టుల సిరీస్‌ నవంబర్‌ 15 నుంచి ప్రారంభం కానుంది.

బంగ్లాదేశ్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా టెస్ట్ జట్టు
టెంబా బావుమా (కెప్టెన్‌), సైమన్ హార్మర్, వియాన్ ముల్డర్, మార్క్వెస్ అకెర్మాన్, జుబేర్ హంజా, అన్రిచ్ నోర్ట్జే, మాథ్యూ బ్రీట్జ్కే, మార్కో జాన్సెన్, డేన్ ప్యాటర్సన్, కార్బిన్ బోష్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడా, టోనీ డి జోర్జి, ఐడెన్ మర్క్రామ్ 
చదవండి: IND vs NZ: షెడ్యూల్‌, జట్లు, మ్యాచ్‌ టైమింగ్స్‌, లైవ్‌స్ట్రీమింగ్‌ వివరాలు

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)