Breaking News

నాకౌట్‌కూ అజేయంగానే...

Published on Mon, 03/02/2026 - 01:16

న్యూఢిల్లీ: గత మెగా ఈవెంట్‌ రన్నరప్‌ దక్షిణాఫ్రికా ఈ టి20 ప్రపంచకప్‌ను కసిమీద ఆడుతోంది. లీగ్‌ దశలో గ్రూప్‌ ‘డి’లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన దక్షిణాఫ్రికా అజేయంగా ‘సూపర్‌–8’కు చేరింది. ‘సూపర్‌–8’లోనూ తమ జోరు కొనసాగిస్తూ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి నాకౌట్‌ పోరుకు సై అంటోంది. దక్షిణాఫ్రికా ఇదివరకే సెమీస్‌ చేరడంతో.... జింబాబ్వేతో ఆదివారం జరిగిన గ్రూప్‌–1 ‘సూపర్‌–8’ నామమాత్రమైంది. 

అయినప్పటికీ సమష్టి ఆటతీరుతో మెరిపించిన మార్క్‌రమ్‌ బృందం 5 వికెట్ల తేడాతో జింబాబ్వేపై గెలుపొంది ఈ టోర్నీలో వరుసగా ఏడో విజయం నమోదు చేసింది. కోల్‌కతాలో బుధవారం జరిగే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ జట్టుతో దక్షిణాఫ్రికా తలపడుతుంది. సెమీఫైనల్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే కేటాయించారు.  దక్షిణాఫ్రికాతో పోరులో టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. 

కెప్టెన్  సికందర్‌ రజా (43 బంతుల్లో 73; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. కార్బిన్‌ బాష్, మఫాక చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం దక్షిణాఫ్రికా 17.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసి గెలిచింది. బ్రెవిస్‌ (18 బంతుల్లో 42; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) భారీ సిక్స్‌లతో విరుచుకుపడగా, జార్జ్‌ లిండే (21 బంతుల్లో 30 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుగ్గా ఆడాడు. బ్రెవిస్‌ అవుటయ్యాక లిండే, స్టబ్స్‌ ఆరో వికెట్‌కు అజేయంగా 53 పరుగులు జోడించి దక్షిణాఫ్రికాను విజయతీరాలకు చేర్చారు. బౌలింగ్‌లోనూ 3 వికెట్లు తీసిన జింబాబ్వే కెప్టెన్  రజాకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. 

స్కోరు వివరాలు 
జింబాబ్వే ఇన్నింగ్స్‌: మరుమని (బి) మఫాక 7; బెనెట్‌ (సి) మార్క్‌రమ్‌ (బి) నోర్జే 15; మైయెర్స్‌ (సి) బ్రెవిస్‌ (బి) లిండే 11; సికందర్‌ రజా (సి) మిల్లర్‌ (బి) మఫాక 73; బర్ల్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఎన్‌గిడి 5; మున్‌యోంగా (బి) బాష్‌ 2; మడండె (నాటౌట్‌) 26; ఇవాన్స్‌ (బి) బాష్‌ 8; మసకద్జా (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–14, 2–28, 3–66, 4–82, 5–87, 6–126, 7–146. బౌలింగ్‌: లిండే 3–0–22–1, మఫాక 4–0–21–2, ఎన్‌గిడి 4–0–29–1, నోర్జే 4–0–29–1, బాష్‌ 4–0–40–2, మార్క్‌రమ్‌ 1–0–11–0. 

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: మార్క్‌రమ్‌ (బి) సికందర్‌ రజా 4; డికాక్‌ (సి) మరుమని (బి) సికందర్‌ రజా 0; రికెల్టన్‌ (సి) బర్ల్‌ (బి) ఇవాన్స్‌ 31; బ్రెవిస్‌ (సి) బర్ల్‌ (బి) సికందర్‌ రజా 42; మిల్లర్‌ (సి) మైయెర్స్‌ (బి) ముజరబాని 22; స్టబ్స్‌ (నాటౌట్‌) 21; లిండే (నాటౌట్‌) 30; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (17.5 ఓవర్లలో 5 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–1, 2–14, 3–43, 4–93, 5–101. బౌలింగ్‌: సికందర్‌ రజా 4–0–29–3, ముజరబాని 3.5–0–32–1, ఇవాన్స్‌ 3–0–22–1, క్రెమర్‌ 2–0–27–0, మసకద్జా 2–0–23–0, బర్ల్‌ 2–0–12–0, బెనెట్‌ 1–0–9–0.    

5 టి20 ప్రపంచకప్‌ చరిత్రలో సికందర్‌ రజా అందుకున్న ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డులు. ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో అత్యధిక ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పురస్కారాలు నెగ్గిన జాబితాలో విరాట్‌ కోహ్లి (8), ఆడమ్‌ జంపా (6) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. మూడో స్థానంలో షేన్‌ వాట్సన్, క్రిస్‌ గేల్, జయవర్ధనే, సికందర్‌ రజా (5 చొప్పున) ఉన్నారు.

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు