Breaking News

చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా కుర్ర బౌలర్‌

Published on Fri, 02/02/2024 - 21:21

అండర్‌-19 వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా యువ పేసర్‌ క్వేనా మపాకా సంచలన ప్రదర్శనలతో దూసుకుపోతున్నాడు. శ్రీలంకతో ఇవాళ (ఫిబ్రవరి 2) జరిగిన మ్యాచ్‌లో ఈ కుర్ర బౌలర్‌ మరో ఐదు వికెట్ల ప్రదర్శనతో (8.2-1-21-6) విజృంభించాడు. మపాకాకు ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇది మూడో ఐదు వికెట్ల ప్రదర్శన. అండర్‌-19 ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్పటివరకు ఏ బౌలర్‌ సింగిల్‌ ఎడిషన్‌లో మూడు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేయలేదు.

ప్రస్తుత ఎడిషన్‌లో మపాకా ఈ మ్యాచ్‌కు ముందు జింబాబ్వే (10-1-34-5), వెస్టిండీస్‌లపై (9.1-1-38-5) ఐదు వికెట్ల ‍ప్రదర్శనలు నమోదు చేశాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన మపాకా 18 వికెట్లు తీసి లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్నాడు. 17 ఏళ్ల లెఫ్ట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ అయిన మపాకా బుల్లెట్‌ వేగంతో నిప్పులు చెరిగే బంతులు సంధిస్తూ ప్రత్యర్ధి బ్యాటర్లను నిశ్రేష్ఠులను చేస్తున్నాడు.

మపాకా సంధించే బంతుల‍కు బ్యాటర్ల వద్ద సమాధానం లేకుండా పోయింది. మపాకా ప్రదర్శనల కారణంగా ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా సెమీస్‌ రేసులో ముందుంది. ఈ కుర్ర బౌలర్‌ ఇటీవలే టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రాకు కూడా సవాలు విసిరాడు. బుమ్రా కంటే వేగంగా యార్కర్లు సంధిస్తానని ఛాలెంజ్‌ చేశాడు. 

ఇదిలా ఉంటే, శ్రీలంకతో మ్యాచ్‌లో మపాకా ఆరేయడంతో దక్షిణాఫ్రికా 119 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ప్రిటోరియస్‌ (71), రిలే నార్టన్‌ (41 నాటౌట్‌) రాణించారు. లంక బౌలర్లలో విశ్వ లహీరు, తరుపతి, వడుగే తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం నామమాత్రపు లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక మపాకా ధాటికి 113 పరుగులకే కుప్పకూలి చిత్తుగా ఓడింది. లంక ఇన్నింగ్స్‌లో షరుజన్‌ షణ్ముకనాథన్‌ (29) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మపాకాతో పాటు రిలే నార్టన్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)