Breaking News

దక్షిణాఫ్రికా...ఈసారైనా!

Published on Wed, 10/29/2025 - 02:14

గువాహటి: అన్ని విభాగాల్లో సమష్టిగా రాణిస్తూ... మహిళల వన్డే ప్రపంచకప్‌లో జోరు మీదున్న దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్‌ బెర్త్‌పై గురి పెట్టింది. ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా ఫైనల్‌ చేరుకోలేకపోయింది. మూడుసార్లు సెమీఫైనల్లోకి ప్రవేశించినా ఆ అడ్డంకిని దాటడంలో విఫలమైంది. నాలుగో ప్రయత్నంలోనైనా సెమీఫైనల్‌ అవరోధాన్ని అధిగమించి ఫైనల్లోకి దూసుకెళ్లాలని దక్షిణాఫ్రికా పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో నేడు జరిగే తొలి సెమీఫైనల్లో పటిష్టమైన ఇంగ్లండ్‌తో దక్షిణాఫ్రికా తలపడనుంది. 

దక్షిణాఫ్రికాతో పోలిస్తే ఇంగ్లండ్‌కు ప్రపంచకప్‌లో అద్భుతమైన రికార్డు ఉంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఇప్పటికే ఎనిమిదిసార్లు ఫైనల్‌ చేరుకున్న ఇంగ్లండ్‌... నాలుగుసార్లు విజేతగా నిలిచి, మరో నాలుగుసార్లు రన్నరప్‌ ట్రోఫీని అందుకుంది. ఇక తాజా ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్‌దే పైచేయిగా ఉంది. తమతో ఆడిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 69 పరుగులకు కుప్పకూల్చిన ఇంగ్లండ్‌ మరోసారి అలాంటి ప్రదర్శన పునరావృతం చేయాలనే లక్ష్యంతో ఉంది. 

మరోవైపు ఇంగ్లండ్‌ చేతిలో ఎదురైన తొలి మ్యాచ్‌  పరాజయానికి బదులు తీర్చుకోవాలని దక్షిణఫ్రికా భావిస్తోంది. ఆస్ట్రేలియాతో లీగ్‌ దశ చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 97 పరుగులకే ఆలౌటైంది. ఈ రెండు సందర్భాల్లోనూ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో సఫారీ బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ లోపాలను వినియోగించుకోవాలని ఇంగ్లండ్‌ ప్రణాళికలు రచిస్తోంది. సోఫీ ఎకిల్‌స్టోన్, లిన్సే స్మిత్, చార్లీ డీన్‌ రూపంలో ఇంగ్లండ్‌కు ముగ్గురు స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు.  

దక్షిణాఫ్రికా కెప్టెన్‌ లారా వోల్‌వార్ట్‌... ఈ టోర్నీలో ఆడిన 7 మ్యాచ్‌ల్లో 50.16 సగటుతో 301 పరుగులు చేసి జట్టును ముందుండి నడిపిస్తోంది. బ్రిట్స్, సునే లుస్, మరిజాన్‌ కాప్‌ రూపంలో దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ లైనప్‌ బలంగానే ఉంది.  బౌలింగ్‌లో కాప్, ఖాకా, ఎంలాబా కీలకం కానున్నారు.  మరోవైపు ఇంగ్లండ్‌ మాజీ సారథి కెప్టెన్‌ హీథర్‌ నైట్‌ ఈ వరల్డ్‌కప్‌లో 288 పరుగులు చేసి ఆ జట్టు తరఫున టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. అమీ జోన్స్, బ్యూమౌంట్‌ కూడా రెండొందల పైచిలుకు పరుగులు చేశారు. కెప్టెన్‌  సివర్‌ బ్రంట్‌ రూపంలో నిఖార్సైన ఆల్‌రౌండర్‌ అందుబాటులో ఉంది.   

రిజర్వ్‌ డే... 
మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నప్పటికీ ఈ టోర్నీలోని రెండు సెమీఫైనల్స్‌కు, ఫైనల్‌ మ్యాచ్‌కు ‘రిజర్వ్‌ డే’ ఉంది. బుధవారం వర్షం కారణంగా మ్యాచ్‌ సాధ్యపడకపోతే... గురువారం నిర్వహిస్తారు. ఒకవేళ గురువారం కూడా మ్యాచ్‌ జరగపోతే మాత్రం లీగ్‌ దశలో మెరుగైన స్థానంలో ఉన్న జట్టు ఫైనల్‌ (ఇంగ్లండ్‌) చేరుకుంటుంది.

36 దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఇప్పటి వరకు 47 వన్డేలు జరిగాయి. 36 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ గెలుపొందగా ... 10 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా నెగ్గింది. ఒక మ్యాచ్‌ రద్దయింది. ఇక వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో ఈ రెండు జట్లు తొమ్మిదిసార్లు తలపడ్డాయి. 7 సార్లు ఇంగ్లండ్, 2 సార్లు దక్షిణాఫ్రికా విజయం సాధించాయి.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)