Breaking News

టెస్ట్‌ అరంగేట్రం చేయనున్న సీఎస్‌కే చిచ్చరపిడుగు

Published on Fri, 06/27/2025 - 19:33

సీఎస్‌కే చిచ్చరపిడుగు డెవాల్డ్‌ బ్రెవిస్‌ తన జాతీయ జట్టు సౌతాఫ్రికా తరఫున టెస్ట్‌ అరంగేట్రానికి సిద్దమయ్యాడు. రేపటి నుంచి జింబాబ్వేతో జరుగబోయే టెస్ట్‌ మ్యాచ్‌ కోసం ప్రకటించిన తుది జట్టులో బ్రెవిస్‌ చోటు దక్కించుకున్నాడు. తుది జట్టు ఆటగాళ్ల జాబితాను క్రికెట్‌ సౌతాఫ్రికా ఇవాళ (జూన్‌ 27) ప్రకటించింది. 

సీనియర్ల గైర్హాజరీలో రెండు మ్యాచ్‌లో ఈ సిరీస్‌లో సౌతాఫ్రికా సారధిగా కేశవ్‌ మహారాజ్‌ ఎంపికయ్యాడు. రేపటి నుంచి ప్రారంభం కాబోయే టెస్ట్‌ మ్యాచ్‌లో మహారాజ్‌ యువ దక్షిణాఫ్రికా జట్టును ముందుండి నడిపిస్తాడు. ఓపెనర్లుగా టోనీ డి జోర్జి, మాథ్యూ బ్రీట్జ్కీ బరిలోకి దిగనుండగా.. వన్‌ డౌన్‌లో వియాన్‌ ముల్దర్‌, నాలుగో స్థానంలో డేవిడ్‌ బెడింగ్హమ్‌, ఐదో స్థానంలో లుహాన్‌ డ్రి ప్రిటోరియస్‌, ఆరో స్థానంలో డెవాల్డ్‌ బ్రెవిస్‌ బరిలోకి దిగనున్నారు. 

వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా కైల్‌ వెర్రిన్‌, ఆల్‌రౌండర్‌ కోటాలో కార్బిన్‌ బాష్‌, స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా కేశవ్‌ మహారాజ్‌, పేసర్లుగా కోడి యూసఫ్‌, క్వేనా మఫాకా బరిలోకి దిగనున్నారు. ఈ మ్యాచ్‌లో బ్రెవిస్‌తో పాటు డ్రి ప్రిటోరియస్‌ కూడా టెస్ట్‌ అరంగేట్రం చేస్తాడు.

వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌గా అవతరించాక సౌతాఫ్రికా ఆడబోయే తొలి మ్యాచ్‌ ఇదే. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగుతుంది. డబ్ల్యూటీసీ టైటిల్‌ గెలవడం ద్వారా సౌతాఫ్రికా చిరకాల కల నెరవేర్చిన రెగ్యులర్‌ కెప్టెన్‌ టెంబా బవుమా ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. 

అలాగే డబ్ల్యూటీసీ ఫైనల్లో అద్భుత సెంచరీ చేసిన మార్క్రమ్‌, అదే మ్యాచ్‌లో చెలరేగిన రబాడ, ఆల్‌రౌండర్‌ జన్సెన్‌, బ్యాటర్‌ ర్యాన్‌ రికెల్టన్‌ ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నారు. వీరందరికి క్రికెట్‌ సౌతాఫ్రికా విశ్రాంతినిచ్చింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడిన కార్బిన్‌ బాష్‌, వియాన్‌ ముల్దర్‌ తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా పేస్‌ విభాగాన్ని ముందుండి నడిపిస్తారు. 

రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం సౌతాఫ్రికా జింబాబ్వేలో పర్యటిస్తుంది. రెండు టెస్ట్‌లు బులవాయోలోని క్వీన్స్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌లో జరుగుతాయి. రెండో టెస్ట్‌ జులై 6 నుంచి ప్రారంభమవుతుంది.

జింబాబ్వేతో తొలి టెస్ట్‌ కోసం సౌతాఫ్రికా తుది జట్టు..
టోనీ డి జోర్జి, మాథ్యూ బ్రీట్జ్కీ, వియాన్ ముల్డర్, డేవిడ్ బెడింగ్హమ్, లుహాన్-డ్రి ప్రిటోరియస్, డెవాల్డ్ బ్రెవిస్, కైల్ వెర్రిన్‌ (వికెట్‌కీపర్‌), కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్ (కెప్టెన్‌), కోడి యూసఫ్, క్వేనా మఫాకా

జింబాబ్వే జట్టు..
క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, తనకా చివాంగా, ట్రెవర్ గ్వాండు, టకుద్జ్వానాషే కైటానో, వెస్లీ మాధేవెరే, క్లైవ్ మదాండే, విన్సెంట్ మసెకేసా, వెల్లింగ్టన్ మసకద్జా, ప్రిన్స్ మస్వౌరే, కుండై మతిగిము, బ్లెస్సింగ్ ముజరబానీ, న్యూమ్యాన్‌ న్యామ్హురి, తఫద్జా సిగ, నికోలస్‌ వెల్చ్, సీన్ విలియమ్స్

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)