Breaking News

ఇది కాదు.. గంభీర్‌కు ముందుంది అసలైన సవాల్‌: గంగూలీ

Published on Sat, 03/14/2026 - 09:09

గౌత‌మ్ గంభీర్‌.. భారత క్రికెట్ చరిత్రలో ఒక ప్లేయర్‌గా, హెడ్‌కోచ్‌గా ప్రత్యేక పేజీలను లిఖించుకున్నాడు. సభ్యునిగా టీ20 ప్రపంచకప్‌-2007, వన్డే ప్రపంచకప్‌-2011 గెలుచుకున్న గంభీర్‌.. ఇప్పుడు కోచ్‌గా టీమిండియాకు రెండు ఐసీసీ టైటిల్స్‌ను అందించాడు. అతడి నేతృత్వంలో భారత జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025తో పాటు ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. 

దీంతో రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన తొలి భారత కోచ్‌గా అతడు చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. గంభీర్‌కు వన్డే ప్రపంచకప్-2027 అసలైన సవాల్ ఎదురుకానుందని గంగూలీ అభిప్రాయపడ్డాడు.

వైట్‌వాల్ క్రికెట్‌లో గంభీర్‌కు అస‌లైన ప‌రీక్ష‌కు వ‌చ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో ఎదురుకానుంది.  అక్కడి పరిస్థితులు జట్టును, కోచ్‌ను తీవ్రంగా పరీక్షిస్తాయి. అయితే గంభీర్ వ‌ద్ద ఉన్న జ‌ట్టుపై నాకు పూర్తి న‌మ్మ‌కం ఉంది. అత‌డు కోచ్‌గా మ‌రోసారి ఖచ్చితంగా  సాధిస్తాడని గంగూలీ పేర్కొన్నాడు.

కాగా వ‌న్డే వరల్డ్‌కప్‌-2023 టైటిల్‌ను తృటిలో కోల్పోయిన భారత జట్టు.. వచ్చే ఏడాది జరగనున్న 50 ఓవర్ల ప్రపంచకప్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. అంతేకాకుండా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ఇదే చివరి వన్డే వరల్డ్ కప్ కానుండడంతో భారత్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే టెస్టుల్లో మాత్రం గంభీర్ తన శైలిని మార్చుకోవాలని గంగూలీ సూచించాడు. "టెస్టుల్లో గంభీర్ ఇంకా మెరుగుపడాలి. ముఖ్యంగా పిచ్ ఎలా ఉంటుందనే ఆలోచనను పక్కన పెట్టాలి. పిచ్‌ను ఒక భూతంలా చూడటం మానేయాలి. స్వదేశంలో జరిగే మ్యాచుల కోసం స్పిన్నర్లకు అనుకూలించే టర్నింగ్ వికెట్లు అవసరం లేదు.

మంచి వికెట్లపై ఆడితేనే మంచి ఫలితాలు వస్తాయి. ఇంగ్లండ్‌ సిరీస్ ఫలితాలే అందుకు నిదర్శనమని గంగూలీ చెప్పుకొచ్చాడు. కాగా గంభీర్ నేతృత్వంలో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లను భారత్ కోల్పోయింది.
చదవండి: BAN vs PAK: ప్ర‌తీకారం తీర్చుకున్న పాకిస్తాన్‌
 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు