Breaking News

పుట్టినరోజు నాడు సౌరవ్‌ గంగూలీ కీలక ప్రకటన

Published on Sat, 07/08/2023 - 19:46

టీమిండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడిగా సేవలు అందించిన సౌరవ్‌ గంగూలీ శనివారం 51వ పడిలో అడుగుపెట్టాడు. 'దాదా' అని ముద్దుగా పిలుచుకునే గంగూలీ క్రికెట్‌ ఆడిన రోజుల్లో ఏం చేసినా సంచలనమే. 2003 వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియాను ఫైనల్‌ చేర్చిన గంగూలీ ఆఖరి మెట్టుపై బోల్తా పడ్డాడు. అంతకముందు 2002లో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోపీ గెలవడంలో కీలకపాత్ర వహించాడు. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన నాట్‌వెస్ట్‌ వన్డే సిరీస్‌ను గెలిచిన సందర్భంలో లార్డ్స్‌ బాల్కనీ నుంచి షర్ట్‌ విప్పి గిరగిరా తిప్పడం ఒక్క దాదాకే చెల్లింది. కాగా గంగూలీ తన పుట్టినరోజు నాడే ఒక కీలక ప్రకటన చేశాడు.

‘సౌరభ్ గంగూలీ మాస్టర్‌క్లాస్‌’ పేరుతో యాప్‌ను అందుబాటులోకి తెచ్చి నాయకత్వ లక్షణాలపై ఆన్‌లైన్‌ కోర్సు ప్రవేశపెడుతున్నట్లు తెలిపాడు.  ''దాదాపు 16 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్, పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లు ఆడిన అనుభవంతో నా 51 పుట్టిన రోజు సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నా. నేను నేర్చుకున్న అంశాలను మీ కోసం తీసుకొస్తున్నా.

'సౌరభ్ గంగూలీ మాస్టర్‌క్లాస్' అనే యాప్‌ ద్వారా మొదటిసారి నాయకత్వంపై ఆన్‌లైన్‌ కోర్సును అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటిస్తున్నా. దీనికోసం కృషి చేసిన క్లాస్‌ప్లస్‌ (ఎడ్‌టెక్ స్టార్టప్‌)కు ధన్యవాదాలు. నేను, క్లాస్‌ప్లస్‌ కలిసి ఆన్‌లైన్‌ కోర్సును మీకు అందించడానికి వస్తున్నాం'' అని తెలిపాడు. ఇక గంగూలీ పుట్టినరోజు పురస్కరించుకొని పలువురు మాజీ క్రికెటర్లు సహా ఈతరం క్రికెటర్లు ట్విటర్‌ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)