Breaking News

మరోసారి అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ

Published on Tue, 09/23/2025 - 08:50

కోల్‌కతా: టీమిండియా మాజీ  కెప్టెన్‌ సౌరవ్‌  గంగూలీ మరోసారి బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (CAB) అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. సోమవారం జరిగిన ‘క్యాబ్‌’ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో గంగూలీని ఏకగ్రీవంగా అధ్యక్ష పదవిని ఎన్నుకున్నారు. 

కాగా 2015–2019 మధ్య ఇదే పదవిలో ఉన్న ఉన్న సౌరవ్‌ (Sourav Ganguly)... ఆరేళ్ల విరామం తర్వాత మళ్లీ అవే బాధ్యతలు చేపట్టడం విశేషం. 2019–2022 మధ్య ‘దాదా’ బీసీసీఐ (BCCI) అధ్యక్షుడిగా కూడా వ్యవహరించాడు. 

ఇక ఈడెన్‌ గార్డెన్స్‌ను ఆధునీకరిస్తూ సామర్థ్యాన్ని లక్షకు పెంచడంతో పాటు ప్రతిష్టాత్మక మ్యాచ్‌లను నిర్వహించేలా తాను ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా గంగూలీ వెల్లడించాడు. ఈ ఏడాది నవంబర్‌లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే టెస్టుకు ఈడెన్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. 

9 ఎకరాల్లో.. 
వచ్చే టీ20 వరల్డ్‌ కప్‌ భారత్‌లో జరగనున్న నేపథ్యంలో కోల్‌కతాకు కీలక మ్యాచ్‌లు దక్కేలా బీసీసీఐతో మాట్లాడి తన ప్రయత్నం చేస్తానని కూడా అతను వెల్లడించాడు. ‘బెంగాల్‌ టీమ్‌ రంజీ ట్రోఫీలో రెండు సార్లు ఫైనల్లో ఆడింది. ఇప్పుడు టీమ్‌ మరింత బలంగా మార్చడమే నా మొదటి లక్ష్యం. 

ఇందులో మరో మాటకు తావు లేదు. క్రికెట్‌ తర్వాతే మిగతా అంశాలు వస్తాయి. 9 ఎకరాల్లో అత్యంత ఆధునిక అకాడమీని నిర్మిస్తాం. దీని కోసం ఇప్పటికే భూమిని తీసుకున్నాం. ప్లానింగ్‌ కూడా పూర్తయింది’ అని సౌరవ్‌ తన ప్రణాళికలు వివరించాడు.  

చదవండి: ఎవర్నీ లెక్కచేయను.. నా తీరే అంత.. నచ్చినట్లు చేస్తా: పాక్‌ బ్యాటర్‌ ఎక్స్‌ట్రాలు

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు