Breaking News

ఆసియాక‌ప్ గెలిచేది ఆ జ‌ట్టే: సౌరవ్‌ గంగూలీ

Published on Sun, 08/10/2025 - 20:38

ఆసియాక‌ప్‌-2025 సెప్టెంబ‌ర్ 9 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 8 జట్లు పాల్గోనే ఈ టోర్నీ దుబాయ్, అబుదాబి వేదికలగా జరగనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం తమ ఆస్తశాస్త్రాలను ఆయా జట్లు సిద్దం చేసుకుంటున్నాయి. ఇప్పటికే అఫ్గానిస్తాన్‌, బంగ్లా క్రికెట్ బోర్డులు తమ ప్రిలిమిరీ జట్లను సైతం ప్రకటించాయి. 

బీసీసీఐ కూడా భారత జట్టు ఆగస్టు మూడో వారంలో ప్రకటించనుంది. కాగా భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ తర్వాత పొట్టి ఫార్మాట్‌లో ఆడడం ఇదే తొలిసారి. దాదాపు ఎనిమిది నెలల తర్వాత టీ20 సిరీస్ ఆడుతున్నప్పటికి సూర్య అండ్ కోపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆసియాక‌ప్ విజేతగా టీమిండియా నిలుస్తుందని  భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జోస్యం చెప్పాడు.

భారత క్రికెట్ జట్టుకు టీ20 ఫార్మాట్‌లో సుదీర్ఘమైన విరామం లభించింది. ఐపీఎల్ తర్వాత ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్ వెళ్లారు. ఇప్పుడు ఆసియాకప్ టీ20 టోర్నీలో పాల్గోనున్నారు. భారత జట్టు ప్రస్తుతం చాలా పటిష్టంగా ఉంది.

మెన్ ఇన్ బ్లూ రెడ్ బాల్ క్రికెట్‌లోనే కాదు వైట్‌బాల్ క్రికెట్‌లో కూడా చాలా బలంగా ఉన్నారు. కాబట్టి భారత్ టైటిల్ దక్కించుకుంటుందని భావిస్తున్నారు. దుబాయ్ లాంటి మంచి పిచ్‌లపై భారత్‌ను ఓడించడం చాలా కష్టం అని గంగూలీ పీటీఐతో పేర్కొన్నాడు. కాగా భారత్ తమ ఆసియాకప్ ప్రయాణాన్ని సెప్టెంబర్ 10న హాంకాంగ్ మ్యాచ్‌తో ప్రారంభించనుంది.
చదవండి: SA vs AUS: చెలరేగిన హాజిల్‌వుడ్‌, డేవిడ్‌.. సౌతాఫ్రికాపై ఆసీస్‌ ఘన విజయం
 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)