Breaking News

అంతా వాళ్ల మీదే ఆధారపడి ఉంది.. అలా అయితేనే ట్రోఫీ గెలుస్తాం: గంగూలీ

Published on Fri, 08/25/2023 - 18:33

ICC ODI World Cup 2023: పుష్కర కాలం తర్వాత టీమిండియా సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌ ఆడనుంది. అక్టోబరు 5 నుంచి భారత్‌ వేదికగా మొదలుకానున్న ఐసీసీ ఈవెంట్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌తో తమ ప్రయాణం ఆరంభించనుంది. చెన్నైలోని చెపాక్‌ వేదికగా అక్టోబరు 8న తమ తొలి మ్యాచ్‌లో ఆసీస్‌తో తలపడనుంది.

ఇక స్వదేశంలో మెగా టోర్నీ జరుగనున్న తరుణంలో రోహిత్‌ సేన హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుందనడంలో సందేహం లేదు. 2011 నాటి ఫలితాన్ని పునరావృతం చేస్తూ.. ఈసారి కూడా భారత్‌ ట్రోఫీని ముద్దాడాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడిగా సేవలు అందించిన సౌరవ్‌ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు.

టీమిండియా ప్రధాన బలం అదే
భారత జట్టుకు ప్రధాన బలం బ్యాటింగ్‌ అని.. బ్యాటర్లు రాణిస్తేనే భారత్‌ టైటిల్‌ గెలిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాడు. ఆసియా కప్‌ ఫలితంతో ప్రపంచకప్‌ ఈవెంట్‌కు సంబంధం ఉండదని దాదా పేర్కొన్నాడు. ‘‘ఆసియా కప్‌.. ఆస్ట్రేలియాతో స్వదేశంలో వన్డే సిరీస్‌... వరల్డ్‌కప్‌..

దేనికదే ప్రత్యేకం. ఒకదానితో మరొకదానికి సంబంధం లేదు. ప్రతి టోర్నమెంట్‌లోనూ ఆడే విధానం భిన్నంగా ఉంటుంది. భారత్‌ పటిష్ట జట్టు. ఒకవేళ మన బ్యాటర్లు రాణిస్తే కచ్చితంగా వరల్డ్‌కప్‌ ట్రోఫీ గెలుస్తాం. కాబట్టి మొత్తమంతా మన బ్యాటర్లు ఎలా ఆడుతారన్న అంశం మీదే ఆధారపడి ఉంది’’ అని గంగూలీ అభిప్రాయపడ్డాడు.

పాక్‌ బౌలింగ్‌ దళం పటిష్టం
ఇక పాకిస్తాన్‌ జట్టు సైతం మెరుగ్గా ఉందన్న దాదా.. ‘‘పాక్‌ బౌలింగ్‌ దళం పటిష్టంగా ఉంది. నసీం షా, షాహిన్‌ ఆఫ్రిది, హారిస్‌ రవూఫ్‌ రాణిస్తున్నారు. మొత్తానికి పాక్‌ టీమ్‌ సమతూకంగా కనిపిస్తోంది. అయితే, టీమిండియాతో పోటీ ఎలా ఉంటుందనేది చెప్పలేం. 

మ్యాచ్‌ రోజు ఎవరు బాగా ఆడతారో విజయం వాళ్లనే వరిస్తుంది. అందులో రాకెట్‌ సైన్స్‌ ఏమీ లేదు’’ అని దాయాదుల పోరులో ఫేవరెట్‌ జట్టు ఏదీ లేదని చెప్పకనే చెప్పాడు. కాగా అక్టోబరు 14న పాక్‌తో అహ్మదాబాద్‌ వేదికగా రోహిత్‌ సేన మ్యాచ్‌ ఆడనుంది. ఇక వరల్డ్‌కప్‌ కంటే ముందు ఆసియా కప్‌లో సెప్టెంబరు 2న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది.

చదవండి: WC: కోహ్లి, బాబర్‌ కాదు.. ఈసారి అతడే టాప్‌ స్కోరర్‌: సౌతాఫ్రికా లెజెండ్‌
Asia Cup: షెడ్యూల్‌, జట్లు, ఆరంభ సమయం, లైవ్‌ స్ట్రీమింగ్‌.. వివరాలివే

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)