Breaking News

అతడొక‌ ఆల్ ఫార్మాట్ ప్లేయ‌ర్‌.. ఆసియాక‌ప్‌లో ఆడాల్సిందే: గంగూలీ

Published on Wed, 08/06/2025 - 17:21

ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టంతా ఆసియాకప్‌-2025పై పడింది. ఆసియాకప్‌నకు భారత జట్టులో ఎవరికి చోటు దక్కుతుంది? ఐపీఎల్‌లో రాణించిన ఆట‌గాళ్ల‌ను సెల‌క్ట‌ర్లు ఎంపిక చేస్తారా? అన్న చ‌ర్చ‌లు క్రికెట్ వ‌ర్గాల్లో ప్ర‌స్తుతం జ‌రుగుతున్నాయి.

ఈ మెగా టోర్నీ సెప్టెంబ‌ర్ 9 నుంచి  యూఏఈ వేదిక‌గా ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం భార‌త జ‌ట్టును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఆగ‌స్టు మూడో వారంలో ప్ర‌క‌టించే అవ‌కాశ‌ముంది. ఈ క్రమంలో భారత సెలక్టర్లకు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గం‍గూలీ కీలక సూచన చేశాడు.

ముఖేష్‌కు ఛాన్స్ ఇవ్వాల్సిందే?
బెంగాల్ పేసర్ ముఖేష్ కుమార్‌ను ఆసియాకప్‌నకు ఎంపిక చేయాలని దాదా సలహాఇచ్చాడు. కాగా ముఖేష్ కుమార్ రెండు సంవత్సరాల కిందట భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు. ఈ కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్  దాదాపు ఏడాది పాటు మూడు ఫార్మాట్లలోనూ టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.

ఆ తర్వాత ఫామ్ కోల్పోవ‌డంతో జ‌ట్టుకు ముఖేష్ దూర‌మ‌య్యాడు. అత‌డు చివ‌ర‌గా భార‌త్ త‌ర‌పున గ‌తేడాది జూలైలో ఆడాడు. ఆ త‌ర్వాత  ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ ముఖేష్ ఆక‌ట్టుకోలేక‌పోయాడు. కానీ అత‌డి వ‌ద్ద అద్బుత‌మైన స్కిల్స్ ఉన్నాయ‌ని, అత‌డికి మ‌రో ఛాన్స్ ఇవ్వాల్సిందేన‌ని గంగూలీ మాత్రం స‌పోర్ట్‌గా నిలిచాడు.

"ఆసియాక‌ప్‌లో ముఖేష్ కుమార్ ఖ‌చ్చితంగా ఆడాలి. అత‌డు అద్భుతమైన ఫాస్ట్ బౌలర్. యూఏఈ కండీష‌న్స్ అత‌డికి స‌రిగ్గా స‌రిపోతాయి. దేశ‌వాళీ క్రికెట్‌లో కూడా నిల‌క‌డ‌గా రాణిస్తున్నాడు. అత‌డు జ‌ట్టులోకి పున‌రాగ‌మ‌నం చేసేందుకు ఆర్హుడు. ముఖేష్‌కు అన్ని ఫార్మాట్ల‌లోనూ రాణించే స‌త్తా ఉంది. అత‌డికంటూ ఒక స‌మయం వ‌స్తుంది. అందుకు కాస్త ఓపిక ప‌ట్టాలి" అని ఇండియా టూడేకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో గంగూలీ పేర్కొన్నాడు.

కాగా ముఖేష్ ఇప్పటివరకు భారత తరపున 17 టీ20లు ఆడి 20 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో అతడి పేరిట 36 వికెట్లు ఉన్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. టెస్టు కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్‌, య‌శ‌స్వి జైశ్వాల్ తిరిగి టీ20 జ‌ట్టులోకి రానున్న‌ట్లు తెలుస్తోంది. అదేవిధంగా స్పోర్ట్స్ హెర్నియా స‌ర్జ‌రీ అనంత‌రం టీమిండియా కెప్టెన్ సూర్య‌కుమార్ సైతం త‌న ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాడు. టోర్నీ ఆరంభ సమయానికి సూర్య పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశముంది
చదవండి: Asia Cup: అతడు భేష్‌.. ఇతడు ఓకే.. టీమిండియా సెలక్టర్లకు తలనొప్పి!

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)