‘నా భర్తపై వేరొకరి కన్ను.. అందుకే నాకు విడాకులు’

Published on Tue, 12/30/2025 - 14:01

పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ ఇమాద్‌ వసీం విడాకులు తీసుకున్నాడు. భార్య సానియా అష్ఫక్‌తో వైవాహిక బంధం నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని ఇమాద్‌ వసీం సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ నేపథ్యంలో సానియా అష్ఫక్‌ సంచలన ఆరోపణలతో ముందుకు వచ్చింది.

నా ముగ్గురు పిల్లలకు తల్లి మాత్రమే ఉంది
తన భర్తను వేరొకరు పెళ్లి చేసుకోవాలనుకున్నారని.. అందుకే తమకు విడాకులు అయ్యాయని సానియా ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘తీవ్ర దుఃఖంలో మునిగిపోయి నేను ఈ నోట్‌ రాస్తున్నాను. నా కాపురం కూలిపోయింది. నా పిల్లలు తండ్రి లేనివాళ్లు అయ్యారు. వాళ్ల నాన్న వారిని విడిచిపెట్టాడు. నా ముగ్గురు పిల్లలకు ఇప్పుడు తల్లి మాత్రమే ఉంది.

ఐదు నెలల పసిబిడ్డ.. ఇంత వరకు తండ్రి ఆ పసికందును ఎత్తుకోనేలేదు. ఈ విషయాలన్నీ పంచుకోకూడదు అనే అనుకున్నాను. అయితే, నేను నిశ్శబ్దంగా ఉంటే.. దానిని నా బలహీనత అనుకుంటున్నారు.

ప్రతీ ఇంట్లో మాదిరే భార్యాభర్తలుగా మా మధ్య కొన్ని విభేదాలు ఉన్న మాట వాస్తవం. అయినప్పటికీ బంధాన్ని నిలబెట్టుకోవాలని నేను భావించాను. భార్యగా, తల్లిగా నా వంతు పాత్రను చక్కగా పోషించాను. నా కాపురాన్ని నిలబెట్టుకునేందుకు వంద శాతం ప్రయత్నించాను.

నా భర్తను వేరొకరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు
కానీ మూడో వ్యక్తి రాకతో నా ఇల్లు ముక్కలైంది. ఆమె నా భర్తను పెళ్లి చేసుకోవాలని భావించింది. అందుకే.. అంతంత మాత్రంగా ఉన్న మా బంధం విచ్ఛిన్నమై విడాకులకు దారితీసింది’’ అని సానియా అష్ఫక్‌ సోషల్‌ మీడియా వేదికగా తన బాధను పంచుకుంది.

చట్టపరంగా చర్యలు తీసుకుంటా
ఇందుకు బదులుగా.. ‘‘ప్రతీసారి ఘర్షణ పడేకంటే కూడా విడాకులు తీసుకోవడమే ఉత్తమమని భావించి.. డివోర్స్‌ కోసం అప్లై చేశాను. ఇక నా పిల్లలు.. నేను ఎప్పటికీ తండ్రినే. వారి బాధ్యత మొత్తం నాదే. ఇలాంటి సమయంలో నా గౌరవం, గోప్యతకు భంగం కలగకుండా సహకరిస్తారని ఆశిస్తున్నా.

కొంతమంది తప్పుడు ప్రచారం చేసే పనిలో ఉన్నారు. దయచేసి వారిని నమ్మకండి. నా పరువు, ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎవరైనా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాను’’ అని ఇమాద్‌ వసీం పేర్కొన్నాడు. కాగా 37 ఏళ్ల ఇమాద్‌ వసీం బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌.

పాకిస్తాన్‌ తరఫున 55 వన్డేలు, 75 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఇమాద్‌ వసీం.. వన్డేల్లో 986, టీ20లలో 554 పరుగులు చేశాడు. ఈ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ఖాతాలో వన్డేల్లో 44, టీ20లలో 73 వికెట్లు ఉన్నాయి. ఇక 2023లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఇమాద్‌ వసీం.. ప్రస్తుతం ఫ్రాంఛైజీ క్రికెట్‌లో కొనసాగుతున్నాడు.

చదవండి: అలా ప్రేమ పుట్టింది.. ఆస్తి భర్త కంటే వంద రెట్లు ఎక్కువే!.. అయితేనేం..

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)