Breaking News

న్యూజిలాండ్‌ తరఫున సెంచరీ బాదిన విజయవాడ కుర్రాడు

Published on Sun, 01/21/2024 - 18:25

సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్‌ 19 క్రికెట్‌ వరల్డ్‌కప్‌లో తెలుగు కుర్రాడు స్నేహిత్‌ రెడ్డి సెంచరీ బాదాడు. నేపాల్‌తో ఇవాళ (జనవరి 21) జరుగుతున్న మ్యాచ్‌లో స్నేహిత్‌ 125 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 147 పరుగులు చేశాడు. పేరు, విజయవాడను చూసి స్నేహిత్‌ భారత్‌ తరఫున సెంచరీ బాదాడని అనుకుంటే పొరబడినట్టే. స్నేహిత్‌ సెంచరీ చేసింది న్యూజిలాండ్‌ తరఫున.

17 ఏళ్ల స్నేహిత్‌ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పుట్టినప్పటికీ.. అతని తల్లిదండ్రులు న్యూజిలాండ్‌కు వలస వెళ్లడంతో ఆ దేశం తరఫున క్రికెట్‌ ఆడుతున్నాడు. స్నేహిత్‌లా న్యూజిలాండ్‌కు వలస వెళ్లి ఆ దేశ జాతీయ జట్టుకు ఆడిన క్రికెటర్లు చాలామంది ఉన్నారు. భారత్‌ వేదికగా ఇటీవల జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌ తరఫున సంచలన ప్రదర్శనలు చేసిన రచిన్‌ రవీంద్ర తల్లిదండ్రులది కూడా ఇండియానే.

ప్రస్తుత న్యూజిలాండ్‌ జట్టులో స్నేహిత్‌తో పాటు భారతీయ మూలాలు ఉన్న మరో ఆటగాడు కూడా ఉన్నాడు. 18 ఏళ్ల లెఫ్ట్‌ ఆర్మ్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ ఒలివర్‌ తెవాతియా న్యూఢిల్లీలో పుట్టి, ప్రస్తుతం న్యూజిలాండ్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 

స్నేహిత్‌ విషయానికొస్తే.. అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు న్యూజిలాండ్‌కు వలస వెళ్లారు. స్నేహిత్‌ విద్యాభ్యాసం, క్రికెట్‌ సాధన అంతా న్యూజిలాండ్‌లో​ జరిగింది. కుడి చేతి బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన స్నేహిత్‌ న్యూజిలాండ్‌ మాజీ ఆటగాళ్లు బీజే వాట్లింగ్‌, క్రెయిగ్‌ కుగ్గెలిన్‌ వద్ద ట్రైనింగ్‌ తీసుకున్నాడు. అండర్‌ 15, అండర్‌ 17 టోర్నీల్లో పరుగుల వరద పారించిన స్నేహిత్‌ పేరు ప్రస్తుతం న్యూజిలాండ్‌లో సెన్సేషన్‌గా మారింది. స్నేహిత్‌ ప్రస్తుత న్యూజిలాండ్‌ ఆటగాళ్లు కేన్‌ విలియమ్సన్‌, డారిల్‌ మిచెల్‌లను అమితంగా ఇష్టపడతాడు. 

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. అండర్‌ 19 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇవాళ నేపాల్‌-న్యూజిలాండ్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌.. స్నేహిత్‌ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 302 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. స్నేహిత్‌తో పాటు కెప్టెన్‌ ఆస్కార్‌ జాక్సన్‌ (75) రాణించాడు. భారత్‌లో పుట్టిన మరో కివీస్‌ క్రికెటర్‌ తెవాతియా డకౌటయ్యాడు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్‌.. 6 ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)