డ్యాన్స్‌తో అదరగొట్టిన స్మృతి మంధాన

Published on Sun, 11/23/2025 - 09:37

భారత మహిళల జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన పెళ్లి పీటలె‍క్కేందుకు సిద్దమైంది. సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో ఆమె వివాహం ఆదివారం(నవంబర్ 23) ఇండోర్‌లో జరగనుంది. ఈ క్రమంలో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన సంగీత్‌లో మంధాన-ముచ్చల్ జంట డ్యాన్స్‌తో అదరగొట్టారు.

తొలుత పలాష్ మెడలో స్మృతి  దండ వేయగా.. అతడు స్టార్ ఓపెనింగ్ బ్యాటర్‌కు వినయంగా వంగి నమస్కరించాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి 'తేను లేకే మైన్ జావంగా' వంటి బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

కాగా ఈ కార్యక్రమానికి స్మృతి సహచర క్రికెటర్లు హాజరై సందడి చేశారు. జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్ తమ డ్యాన్స్‌లతో దుమ్ములేపారు. వారి వివాహ వేడుకల్లో భాగంగా, 'టీమ్ బ్రైడ్' (వధువు జట్టు), 'టీమ్ గ్రూమ్' (వరుడి జట్టు) మధ్య ఒక సరదా క్రికెట్ మ్యాచ్ కూడా జరిగింది. 

స్మృతి కెప్టెన్‌గా వ్యవహరించిన 'టీమ్ బ్రైడ్' ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. అంతకుముందు శుక్రవారం జరిగిన స్మృతి హల్దీ వేడుకలో భారత మహిళా క్రికెటర్లు తమ ఆటపాటలతో అలరించారు. కాగా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న స్మృతి-పలాశ్‌ జంట.. 2024లో తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. 

​ఇటీవలే పలాశ్‌ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో స్మృతికి మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేశారు. అనంతరం తన ఎంగేజ్‌మెంట్ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా స్మృతి అభిమానులతో పంచుకుంది.
చదవండి: కెప్టెన్‌గా సంజూ శాంస‌న్‌.. అధికారిక ప్ర‌కట‌న‌

 


 

 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)