చరిత్ర సృష్టించిన స్మృతి మంధన.. టీమిండియా భారీ స్కోర్‌

Published on Sun, 12/28/2025 - 20:44

రికార్డుల రారాణి, టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధన మరో భారీ రికార్డు నెలకొల్పింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 10000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సాధించింది. ఈ మైలురాయిని తాకేందుకు మంధనకు కేవలం 281 ఇన్నింగ్స్‌లే అవసరమయ్యాయి. గతంలో ఈ రికార్డు టీమిండియాకే చెందిన మిథాలీ రాజ్‌ పేరిట ఉండేది.

మిథాలీ ఈ మైలురాయిని తన 291 ఇన్నింగ్స్‌లో తాకింది. తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో ఇవాళ (డిసెంబర్‌ 28) జరుగుతున్న నాలుగో టీ20లో మంధన ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో 48 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసిన మంధన.. 28 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద 10000 పరుగుల మైలురాయిని తాకింది.

చరిత్రలో కేవలం నాలుగో ప్లేయర్‌
మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు నలుగురు మాత్రమే 10000 పరుగులు పూర్తి చేసుకున్నారు. వీరిలో మంధన నాలుగో క్రికెటర్‌గా నిలిచింది. ఈమె​కు ముందు టీమిండియా మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (10868), న్యూజిలాండ్‌కు చెందిన సూజీ బేట్స్‌ (10652), ఇంగ్లండ్‌కు చెందిన చార్లోట్‌ ఎడ్వర్డ్స్‌ (10273) మాత్రమే ఈ ఘనత సాధించారు.

టీమిండియా భారీ స్కోర్‌
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న నాలుగో టీ20లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు స్మృతి మంధన (48 బంతుల్లో 80; 11 ఫోర్లు, 3 సిక్సర్లు), షఫాలీ వర్మ (46 బంతుల్లో 79; 12 ఫోర్లు, సిక్స్‌) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఆఖర్లో రిచా ఘోష్‌ (16 బంతుల్లో 40 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ఆడింది.

సిరీస్‌ ఇదివరకే కైవసం 
కాగా, టీమిండియా స్వదేశంలో శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు పూర్తి కాగా.. మూడింట టీమిండియానే గెలిచింది. తద్వారా మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది.

 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)