మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!
Breaking News
హాఫ్ సెంచరీతో మంధాన ప్రపంచ రికార్డు
Published on Fri, 07/10/2026 - 18:39
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన హాఫ్ సెంచరీతో మెరిసింది. లార్డ్స్ వేదికగా మహిళల క్రికెట్లో ఇదే తొలి టెస్టు కావడంతో మంధాన అరుదైన ఫీట్ సాధించింది. లార్డ్స్ వేదికలో అర్ధసెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా మంధాన రికార్డులకెక్కింది.

50 బంతుల్లో ఫిఫ్టీ సాధించిందిన మంధాన ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అంతేకాదు మంధాన తన ఫిఫ్టీతో మరో రికార్డు కూడా అందుకుంది. టెస్టు క్రికెట్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన మహిళా క్రికెటర్ల జాబితాలో మంధాన చోటు దక్కించుకుంది. గతంలో 2021లో ఆస్ట్రేలియాతో టెస్టులో 51 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ సాధించిన మంధాన ఇంగ్లండ్‌తో టెస్టులో 50 బంతుల్లో ఆ మార్క్‌ను చేరుకుంది.
భారత క్రికెటర్లలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన మూడో క్రికెటర్‌గా నిలిచింది. మంధాన కంటే ముందు సంగీతా డాబిర్ (1995లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 42 బంతులు), శుభా సతీశ్ (2023లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 49 బంతుల్లో) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్‌గా చూసుకుంటే మంధాన ఐదో స్థానంలో ఉంది.

తొలి స్థానంలో సంగీతా డాబిర్ ఉండగా, ఇంగ్లండ్‌కు చెందిన నట్ సివర్ బ్రంట్ (46 బంతులు, 48 బంతులు) రెండుసార్లు ఈ ఫీట్ అందుకోగా, శుభా సతీశ్ నాలుగో స్థానంలో ఉంది. మ్యాచ్ విషయానికొస్తే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 25 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. మంధాన (56), హర్మన్‌ప్రీత్ (15) పరుగులతో క్రీజులో ఉన్నారు.
First Test FIFTY in women's cricket at Lord's 🏟️
And it's none other than #TeamIndia vice-captain Smriti Mandhana 👏👏
Updates ▶️ https://t.co/O1rEau8j8n#ENGvIND pic.twitter.com/Z2oaM5vqsz— BCCI Women (@BCCIWomen) July 10, 2026
చదవండి: చెప్పి మరీ ఔట్ చేశాడు.. వైభవ్‌కు ఆర్చర్ స్ట్రోక్!
Tags : 1