Breaking News

రసవత్తరంగా యాషెస్‌ రెండో టెస్టు..

Published on Fri, 12/05/2025 - 19:16

బ్రిస్బేన్ వేదికగా ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో రోజు ఆటలో మాత్రం ఇంగ్లీష్ జట్టుపై కంగారులు పై చేయి సాధించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 6 వికెట్లు కోల్పోయి 378 పరుగులు చేసింది.

ఆతిథ్య జట్టు ప్రస్తుతం 44 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో అలెక్స్ కారీ (46*), నీసర్‌(15*) ఉన్నారు. అదేవిధంగా ఆసీస్ టాపర్డర్ బ్యాటర్లు  జేక్ వెదరాల్డ్ (72), మార్నస్ లబుషేన్ (65), స్టీవ్ స్మిత్ (61) హాఫ్ సెంచరీలతో రాణించారు. పెర్త్ టెస్టు హీరో ట్రావిస్ హెడ్ 33 పరుగులకే పరిమితయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఇప్పటివరకు బ్రైడన్ కార్స్ మూడు, స్టోక్స్ రెండు, ఆర్చర్ ఓ వికెట్ సాధించారు.

అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్‌ స్కోర్‌(325/9)కు తొమ్మిది పరుగులు జోడించి 334 పరుగుల వద్ద ఆలౌటైంది. ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్‌(138) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. జాక్ క్రాలీ(76),ఆర్చర్‌(38) రాణించారు. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ 6 వికెట్లతో సత్తాచాటాడు. కాగా తొలి టెస్టులో ఇంగ్లండ్‌ను ఆసీస్ చిత్తు చేసిన సంగతి తెలిసిందే.
చదవండి: పాక్‌ క్రికెటర్‌ ఫఖర్‌ జమాన్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)