Breaking News

హైదరాబాద్‌ను గెలిపించిన తిలక్‌ వర్మ.. వరుసగా రెండో మ్యాచ్‌లో..!

Published on Tue, 10/17/2023 - 13:22

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీ 2023లో టీమిండియా అప్‌ కమింగ్‌ ఆటగాడు తిలక్‌ వర్మ (హైదరాబాద్‌ కెప్టెన్‌) సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో నిన్న జరిగిన మ్యాచ్‌లో (మేఘాలయ) మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ (31 బంతుల్లో 41 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడిన తిలక్‌.. జమ్ము అండ్‌ కశ్మీర్‌తో ఇవాళ (అక్టోబర్‌ 17) జరిగిన మ్యాచ్‌లోనూ అచ్చం అలాంటి ఇన్నింగ్సే ఆడి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇవాల్టి మ్యాచ్‌లో 43 బంతులు ఎదుర్కొన్న తిలక్‌ 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన జమ్ము అండ్‌ కశ్మీర్‌.. శుభమ్‌ పుండిర్‌ (58) అర్ధసెంచరీతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. హైదరాబాద్‌ బౌలర్లలో రవితేజ, మిలింద్‌, చింట్ల రక్షణ్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అనికేత్‌ రెడ్డి ఓ వికెట్‌ దక్కించకున్నాడు.

అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్‌.. తిలక్‌ వర్మతో పాటు మిగతా ఆటగాళ్లు కూడా తలో చేయి వేయడంతో 18.3 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. తన్మయ్‌ అగర్వాల్‌ (20), రోహిత్‌ రాయుడు (38), రాహుల్‌ సింగ్‌ (35 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేసి రాణించారు. జమ్ము అండ్‌ కశ్మీర్‌ బౌలర్లలో యుద్ద్‌వీర్‌ సింగ్‌, సాహిల్‌ లోత్రా తలో వికెట్‌ పడగొట్టారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)