Breaking News

న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌.. రాణించిన కరుణరత్నే, చండీమల్‌

Published on Fri, 09/20/2024 - 19:38

స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో శ్రీలంక పట్టు సాధించే దిశగా ముందుకెళ్తుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. ప్రస్తుతం శ్రీలంక 202 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.

రాణించిన కరుణరత్నే, చండీమల్‌
కరుణరత్నే (83), చండీమల్‌ (61) అర్ద సెంచరీలతో రాణించడంతో శ్రీలంక సెకెండ్‌ ఇన్నింగ్స్‌కు గట్టి పునాది పడింది. పథుమ్‌ నిస్సంక​ (2) ఆదిలోనే ఔటైనా వీరిద్దరు రెండో వికెట్‌కు 147 పరుగులు జోడించారు. ప్రస్తుతం ఏంజెలో మాథ్యూస్‌ (34), ధనంజయ డిసిల్వ (34) క్రీజ్‌లో ఉన్నారు. 

తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన కమిందు మెండిస్‌ తక్కువ స్కోర్‌కే (13) ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఇన్నింగ్స్‌ను దెబ్బకొట్టిన విలియమ్‌ ఓరూర్కీ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లోనూ తన మార్కు చూపిస్తున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను ఇప్పటికే మూడు వికెట్లు పడగొట్టాడు. అజాజ్‌ పటేల్‌కు ఓ వికెట్‌ దక్కింది.

లీడ్‌ సాధించిన న్యూజిలాండ్‌
అంతకుముందు న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 340 పరుగులు చేసింది. టామ్‌ లాథమ్‌ (70), కేన్‌ విలియమ్సన్‌ (55), డారిల్‌ మిచెల్‌ (57) అర్ద సెంచరీలతో రాణించారు. గ్లెన్‌ ఫిలిప్స్‌ 49 పరుగులతో అజేయంగా నిలిచాడు. రచిన్‌ రవీంద్ర (39), టామ్‌ బ్లండెల్‌ (25) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లంక బౌలర్లలో ప్రభాత్‌ జయసూర్య 4, రమేశ్‌ మెండిస్‌ 3, ధనంజయ డిసిల్వ 2 వికెట్లు పడగొట్టారు.

కమిందు సెంచరీ.. ఐదేసిన రూర్కీ
కమిందు మెండిస్‌ సెంచరీతో (114) కదంతొక్కడంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 305 పరుగులు చేయగలిగింది. కుసాల్‌ మెండిస్‌ (50) అర్ద సెంచరీతో రాణించాడు. నిస్సంక​ (27), చండీమల్‌ (30), మాథ్యూస్‌లకు (36) మంచి స్టార్ట్‌ లభించినా భారీ స్కోర్లు చేయలేకపోయారు. 

కెరీర్‌లో రెండో టెస్ట్‌ ఆడుతున్న రూర్కీ ఐదు వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బకొట్టాడు. అజాజ్‌ పటేల్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌ తలో రెండు, సౌథీ ఓ వికెట్‌ పడగొట్టారు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

చదవండి: బంగ్లాతో తొలి టెస్ట్‌.. భారీ ఆధిక్యం దిశగా టీమిండియా

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)