Breaking News

శ్రీలంకతో రెండో టెస్ట్‌.. ఆసీస్‌ బౌలర్ల విజృంభణ.. హెడ్‌ వెరైటీ సెలబ్రేషన్‌

Published on Thu, 02/06/2025 - 19:57

గాలే వేదికగా శ్రీలంకతో (Sri Lanka) జరుగుతున్న రెండో టెస్ట్‌ తొలి రోజు ఆస్ట్రేలియా (Australia) పైచేయి సాధించింది. ఆ జట్టు బౌలర్లు విజృంభించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు మాత్రమే చేసింది. మిచెల్‌ స్టార్క్‌, నాథన్‌ లయోన్‌ తలో మూడు వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బేశారు. మాథ్యూ కుహ్నేమన్‌ 2, ట్రవిస్‌ హెడ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. 

లంక ఇన్నింగ్స్‌లో దినేశ్‌ చండీమల్‌ (74), కుసాల్‌ మెండిస్‌ (59 నాటౌట్‌) అర్ద సెంచరీలతో రాణించగా.. మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. పథుమ్‌ నిస్సంక 11, దిముత్‌ కరుణరత్నే 36, ఏంజెలో మాథ్యూస్‌ 1, కమిందు మెండిస్‌ 13, ధనంజయ డిసిల్వ 0, రమేశ్‌ మెండిస్‌ 28, ప్రభాత్‌ జయసూర్య 0, నిషాన్‌ పెయిరిస్‌ డకౌట్‌ అయ్యారు. కుసాల్‌ మెండిస్‌కు జతగా లహీరు కుమార (0) క్రీజ్‌లో ఉన్నాడు. లంక ఇన్నింగ్స్‌లో ముగ్గురు డకౌట్‌ అయ్యారు.

హెడ్‌ వినూత్న సంబురాలు
ఈ మ్యాచ్‌లో కమిందు మెండిస్‌ను ఔట్‌ చేసిన అనంతరం ట్రవిస్‌ హెడ్‌ వినూత్న రీతిలో సంబురాలు చేసుకున్నాడు. చేయి నొప్పి పెడితే కాని, కాలితే కాని ఎలా విదిలించుకుంటామో అలా చేశాడు. హెడ్‌ ఇలాంటి వెరైటీ సంబురాలు చేసుకోవడం ఇది తొలిసారి కాదు. కొద్ది రోజుల కిందట భారత్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌ సందర్భంగా కూడా ఇంచుమించు ఇలాంటి సంబురాలే చేసుకున్నాడు.

కాగా, రెండు టెస్ట్‌లు, రెండు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం​ ఆస్ట్రేలియా శ్రీలంకలో పర్యటిస్తుంది. తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 242 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఉస్మాన్‌ ఖ్వాజా (232) డబుల్‌ సెంచరీతో కదంతొక్కగా.. జోష్‌ ఇ​ంగ్లిస్‌ (102), స్టీవ్‌ స్మిత్‌ (141) సెంచరీలతో మెరిశారు. 

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే ఆలౌటై ఫాలో ఆన్‌ ఆడింది. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లోనూ (247 ఆలౌట్‌) లంక పరిస్థితి మారలేదు. ఫలితంగా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆసీస్‌ బౌలర్లు కుహ్నేమన్‌ 9, నాథన్‌ లయోన్‌ 7 వికెట్లు తీసి లంక పతనాన్ని శాశించారు.

టెస్ట్‌ సిరీస్‌ అనంతరg ఫిబ్రవరి 12, 14 తేదీల్లో కొలొంబో వేదికగా శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య రెండు వన్డేలు జరుగనున్నాయి. అనంతరం ఆసీస్‌ ఇక్కడి నుంచే నేరుగా పాకిస్తాన్‌కు వెళ్తుంది (ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొనేందుకు). ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆసీస్‌ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 22న ఆడుతుంది. లాహోర్‌లో జరిగే ఆ మ్యాచ​్‌లో ఆసీస్‌.. ఇంగ్లండ్‌తో తలపడుతుంది.

 

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)