Breaking News

శ్రీలంకతో తొలి టెస్టు: టీ20 తరహాలో ట్రవిస్‌ హెడ్‌ బాదుడు

Published on Wed, 01/29/2025 - 11:56

శ్రీలంకతో తొలి టెస్టు(Sri Lanka Vs Australia)లో ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ ట్రవిస్‌ హెడ్‌(Travis Head) ధనాధన్‌ దంచికొట్టాడు. తనను ఓపెనర్‌గా పంపినందుకు... అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుని జట్టుకు శుభారంభం అందించాడు. మెరుపు అర్ధశతకంతో సత్తా చాటి తన విలువను చాటుకున్నాడు.

కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) 2023-25 ఎడిషన్‌లో ఆస్ట్రేలియా ఇప్పటికే ఫైనల్‌కు చేరుకుంది. టైటిల్‌ పోరులో సౌతాఫ్రికాతో జూన్‌లో తలపడనుంది. అంతకంటే ముందు ఈ సీజన్‌లో ఆఖరిగా శ్రీలంకతో రెండు టెస్టులు ఆడేందుకు అక్కడికి వెళ్లింది.

ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గాలె వేదికగా బుధవారం తొలి టెస్టు ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఉస్మాన్‌ ఖవాజా(Usman Khawaja)కు ఓపెనింగ్‌ జోడీగా ప్రమోట్‌ అయిన టీ20 వీరుడు ట్రవిస్‌ హెడ్‌ ఆది నుంచే లంక బౌలర్లపై అటాక్‌ చేశాడు.

తొలి ఓవర్లోనే మూడు బౌండరీలు.. మెరుపు ఫిఫ్టీ
ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే తన మార్కు చూపించిన హెడ్‌..  తొలి ఓవర్లోనే మూడు బౌండరీలు బాదాడు. లంక పేసర్‌ అసిత ఫెర్నాండో బౌలింగ్‌లో మూడు, ఐదు, ఆరో బంతికి ఫోర్లు బాదాడు. అదే జోరులో వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. 35 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు.

మొత్తంగా నలభై బంతులు ఎదుర్కొన్న ట్రవిస్‌ హెడ్‌.. 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. లంక స్పిన్నర్‌ ప్రబాత్‌ జయసూర్య బౌలింగ్‌లో చండీమాల్‌కు క్యాచ్‌కు ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఇక హెడ్‌ ఇన్నింగ్స్‌లో పది ఫోర్లతో పాటు.. ఒక సిక్సర్‌ కూడా ఉంది.

టీ20 తరహా వీరబాదుడు
ఈ నేపథ్యంలో తనను టెస్టుల్లో ఓపెనర్‌గా ప్రమోట్‌ చేసినందుకు హెడ్‌.. మేనేజ్‌మెంట్‌కు పైసా వసూల్‌ ప్రదర్శన ఇచ్చాడంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు. టెస్టు ఫార్మాట్లోనూ టీ20 తరహా వీరబాదుడు బాదడం అతడికి మాత్రమే చెల్లుతుందంటూ కొనియాడుతున్నారు. ఇక సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్యాన్స్‌ అయితే.. హెడ్‌ ఇప్పటి నుంచే ఐపీఎల్‌ మోడ్‌లోకి వెళ్లిపోయాడంటూ ఆకాశానికెత్తుతున్నారు.

స్టీవ్‌ స్మిత్‌ సారథ్యంలో
కాగా శ్రీలంకతో టెస్టులకు ఆస్ట్రేలియా రెగ్యులర్‌ టెస్టు కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మాజీ సారథి స్టీవ్‌ స్మిత్‌ ఈ సిరీస్‌లో కంగారూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఇక తాజా పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా శ్రీలంకతో రెండు టెస్టులతో పాటు.. కొలంబో వేదికగా రెండు వన్డేల సిరీస్‌ కూడా ఆడనుంది. ఫిబ్రవరి 14న రెండో వన్డేతో ఆసీస్‌ లంక టూర్‌ ముగుస్తుంది. 

ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో హెడ్‌తో పాటు మరో ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా కూడా అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ మార్నస్‌ లబుషేన్‌ అతడికి సహకారం అందిస్తున్నాడు. లంకతో తొలి రోజు ఆటలో భాగంగా 29 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా వికెట్‌ నష్టానికి  132 పరుగులు చేసింది.

శ్రీలంక వర్సెస్‌ ఆస్ట్రేలియా తొలి టెస్టు
తుదిజట్లు
శ్రీలంక
దిముత్ కరుణరత్నే, ఓషద ఫెర్నాండో, దినేష్ చండిమాల్, ఏంజెలో మాథ్యూస్, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా (కెప్టెన్‌), కుశాల్ మెండిస్ (వికెట్), ప్రబాత్ జయసూర్య, నిషాన్ పీరిస్, జెఫ్రీ వాండర్సే, అసిత ఫెర్నాండో.

ఆస్ట్రేలియా
ఉస్మాన్ ఖవాజా, ట్రవిస్ హెడ్, మార్నస్ లబుషేన్‌, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్‌), జోష్ ఇంగ్లిస్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ (వికెట్‌ కీపర్‌), మిచెల్ స్టార్క్, మాథ్యూ కుహ్నెమాన్, నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ.

చదవండి: Suryakumar Yadav: అతడొక వరల్డ్‌క్లాస్‌ బౌలర్‌.. మా ఓటమికి కారణం అదే

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)