Breaking News

స్టీవ్‌ స్మిత్‌ అరుదైన ఘనత.. 10000 పరుగుల క్లబ్‌లో చేరిక

Published on Wed, 01/29/2025 - 14:14

ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (Steve Smith) అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్‌ల్లో 10000 పరుగుల క్లబ్‌లో చేరాడు. గాలే వేదికగా శ్రీలంకతో ఇవాళ (జనవరి 29) ప్రారంభమైన తొలి టెస్ట్‌లో స్టీవ్‌ ఈ ఘనత సాధించాడు. 9999 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన స్టీవ్‌.. తొలి బంతికే 10000 పరుగుల మార్కును అందుకున్నాడు. స్టీవ్‌ ఈ ఘనత సాధించిన నాలుగో ఆస్ట్రేలియన్‌ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. 

స్టీవ్‌కు ముందు రికీ పాంటింగ్‌ (13378), అలెన్‌ బోర్డర్‌ (11174), స్టీవ్‌ వా (10927) ఈ ఘనత సాధించారు. 10000 పరుగుల మార్కును తన 205వ ఇన్నింగ్స్‌లో అధిగమించిన స్టీవ్‌.. బ్రియాన్‌ లారా (195), సచిన్‌ టెండూల్కర్‌ (195), కుమార సంగక్కర (195), రికీ పాంటింగ్‌ (196) తర్వాత అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల పరంగా) ఈ ఫీట్‌ను సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.

టెస్ట్‌ క్రికెట్‌లో ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ప్లేయర్లలో జో రూట్‌ (12972) తర్వాత స్టీవ్‌ స్మిత్‌ ఒక్కడే 10000 పరుగుల క్లబ్‌లో చేరాడు. స్టీవ్‌ సమకాలీకులు కేన్‌ విలియమ్సన్‌ (9276), విరాట్‌ కోహ్లి (9230) ఇంకా 9000 పరుగుల క్లబ్‌లోనే ఉన్నారు. రూట్‌, స్టీవ్‌ స్మిత్‌, కేన్‌ విలియమ్సన్‌ (Kane Williamson), విరాట్‌ కోహ్లిలను (Virat Kohli) ఈ జమానా ఫాబ్‌ ఫోర్‌గా కీర్తిస్తారు. స్టీవ్‌ తన 115 మ్యాచ్‌ల టెస్ట్‌​ కెరీర్‌లో 205 ఇన్నింగ్స్‌లు ఆడి 56.18 సగటున 10056* పరుగులు చేశాడు. ఇందులో 4 డబుల్‌ సెంచరీలు, 34 సెంచరీలు, 42 అర్ద సెంచరీలు ఉన్నాయి.

శ్రీలంకతో మ్యాచ్‌లో స్టీవ్‌ స్మిత్‌ హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో స్టీవ్‌ 74 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 59 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న ఆస్ట్రేలియా 51 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది.

ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖ్వాజా (102 నాటౌట్‌) చాలాకాలం తర్వాత సెంచరీతో మెరువగా, స్టీవ్‌ స్మిత్‌, ట్రవిస్‌ హెడ్‌ అర్ద సెంచరీలతో రాణించారు. హెడ్‌ టీ20 తరహాలో బ్యాటింగ్‌ చేసి 40 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. ఖ్వాజా తన సెంచరీలో 8 బౌండరీలు, ఓ సిక్సర్‌ కొట్టాడు. లంక బౌలర్లలో ప్రభాత్‌ జయసూర్యకు హెడ్‌ వికెట్‌ దక్కగా.. జెఫ్రీ వాండర్సేకు లబూషేన్‌ (20) వికెట్‌ దక్కింది.

కాగా, వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన​్‌షిప్‌ 2023-25లో భాగంగా ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ (రెండు వన్డేలు కూడా) కోసం శ్రీలంకలో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌ ఫలితంతో సంబంధం లేకుండానే ఆసీస్‌ ఇదివరకే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరింది. జూన్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్‌.. సౌతాఫ్రికాతో ఆమీతుమీ తేల్చుకోనుంది.

శ్రీలంకతో టెస్ట్‌ సిరీస్‌కు ఆసీస్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ దూరంగా ఉన్నాడు. గాయం కారణంగా కమిన్స్‌ ఈ సిరీస్‌లో పాల్గొనడం లేదు. ఈ కారణంగా స్టీవ్‌ స్మిత్‌ ఆసీస్‌కు సారథ్యం వహిస్తున్నాడు. మరోవైపు ఈ సిరీస్‌లో ట్రవిస్‌ హెడ్‌కు ప్రమోషన్‌ లభించింది. మిడిలార్డర్‌ బ్యాటింగ్‌కు దిగే హెడ్‌.. తొలి టెస్ట్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. వచ్చీ రాగానే హెడ్‌ ఓపెనింగ్‌ స్థానంలో తనదైన మార్కును చూపించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగే హెడ్‌.. ఇక్కడ కూడా అదే తరహా చెలరేగిపోయాడు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)