Breaking News

పడి లేచిన శ్రీలంక.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్‌ కైవసం

Published on Wed, 06/07/2023 - 18:33

ఆఫ్ఘనిస్తాన్‌తో స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను శ్రీలంక 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ కోల్పోయిన లంకేయులు, ఆతర్వాత అనూహ్య రీతిలో పుంజుకుని సిరీస్‌ను చేజిక్కించుకున్నారు. హంబన్‌తోట వేదికగా ఇవాళ (జూన్‌ 7) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో లంక బౌలర్ల ధాటికి ఆఫ్ఘన్‌ బ్యాటర్లు తలవంచారు.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌.. చమీర (4/63), హసరంగ (3/7), లహీరు కుమార (2/29), తీక్షణ (1/16) చెలరేగడంతో 22.2 ఓవర్లలోనే 116 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ఘన్‌ ఇన్నింగ్స్‌లో నబీ (23) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక.. ఓపెనర్లు పథుమ్‌ నిస్సంక (51), దిముత్‌ కరుణరత్నే (56 నాటౌట్‌) అర్ధసెంచరీలతో రాణించడంతో కేవలం 16 ఓవర్లలోనే వికెట్‌ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్‌ తరుపు ముక్క రషీద్ ఖాన్‌ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. బ్యాటింగ్‌లో 8 బంతులు ఆడి కేవలం 2 పరుగులు మాత్రమే చేసిన రషీద్‌.. 4 ఓవర్లు బౌల్‌ చేసి వికెట్‌ లేకుండా 21 పరుగులు సమర్పించుకున్నాడు. కాగా, ఈ సిరీస్‌ అనంతరం ఆఫ్ఘనిస్తాన్‌.. బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. అక్కడ వీరు ఓ టెస్ట్‌, 3 వన్డేలు, 2 టీ20లు ఆడనున్నారు. 
చదవండి: WTC Final: ఏం ప్రాక్టీస్‌ చేశారని గెలవడానికి .. గెలుపు ఆస్ట్రేలియాదే..!

Videos

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)