Breaking News

లంక బ్యాట‌ర్ శివ‌తాండ‌వం.. 39 బంతుల్లోనే సెంచ‌రీ

Published on Fri, 09/04/2026 - 07:32

ఇంగ్లండ్ టూర్‌కు ఎంపికైన ఆనందంలో శ్రీలంక మాజీ కెప్టెన్ దాసున్ ష‌న‌క క‌రీబియన్ ప్రీమియ‌ర్ లీగ్ (సీపీఎల్ 2026)లో శివ‌తాండ‌వం ఆడాడు. సీపీఎల్‌లో భాగంగా సెంట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్ త‌ర‌ఫున ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ష‌న‌క సెంట్ లూసియా కింగ్స్‌తో మ్యాచ్‌లో ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. 

కేవ‌లం 39 బంతుల్లోనే శ‌త‌కం సాధించిన దాసున్ ష‌న‌క ఓవ‌రాల్‌గా 43 బంతుల్లో 8 ఫోర్లు, 12 సిక్స‌ర్ల సాయంతో 121 ప‌రుగులతో అజేయంగా నిలిచాడు. క‌రీబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో ష‌న‌క సాధించిన సెంచ‌రీ అత్యంత వేగ‌వంత‌మైన శ‌త‌కంగా రికార్డుల‌కెక్కింది. ఇటీవ‌లే షిమ్రోన్ హెట్‌మైర్ 40 బంతుల్లో సెంచ‌రీ సాధించ‌గా, దానిని ష‌న‌క అధిగ‌మించి రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. 


Photo Credit: CPL Twitter

సీపీఎల్ చ‌రిత్ర‌లో ష‌న‌క 39 బంతుల్లో సెంచ‌రీ చేసి తొలి స్థానంలో నిల‌వ‌గా, హెట్‌మైర్‌, టిమ్ సీఫెర్ట్‌, ఆండ్రీ ర‌సెల్‌లు 40 బంతుల్లో శ‌త‌కాలు సాధించి సంయుక్తంగా రెండో స్థానంలో  కొన‌సాగుతున్నారు. మ‌రో విండీస్ హిట్ట‌ర్ షెయ్ హోప్ 41 బంతుల్లో ఈ ఫీట్ అందుకున్నాడు. ఇక‌ ర‌సెల్ ఖాతాలో సీపీఎల్ రెండు ఫాస్టెస్ట్ సెంచ‌రీలున్నాయి. ఒక‌సారి 40 బంతుల్లో శ‌త‌కం చేస్తే, మ‌రోసారి 42 బంతుల్లో సెంచ‌రీ సాధించాడు.

దాసున్ ష‌న‌క విధ్వంసంతో సెంట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్ 20 ఓవ‌ర‌ల్లో 4 వికెట్ల న‌ష్టానికి 234 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. ష‌న‌కకు తోడుగా వికెట్ కీప‌ర్ ఆండ్రీ ఫ్లెచ‌ర్  (38 బంతుల్లో 64) అర్థ‌సెంచ‌రీతో రాణించాడు. అంత‌క‌ముందు ఓపెన‌ర్ జాన్స‌న్ చార్లెస్ (26) ఆక‌ట్టుకున్నాడు. సెంట్ లూసియా బౌల‌ర్ల‌లో మాథ్యూ ఫోర్డె 2 వికెట్లు తీయ‌గా, తీక్ష‌ణ ఒక వికెట్ ప‌డ‌గొట్టాడు.

కాగా ఈ నెల‌లో లంక జ‌ట్టు ఇంగ్లండ్ పర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. టూర్‌లో భాగంగా శ్రీలంక వ‌న్డేల‌తో పాటు టీ20 సిరీస్ ఆడ‌నుంది. రెండేళ్ల త‌ర్వాత జాతీయ జ‌ట్టులోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలంక మాజీ కెప్టెన్ ష‌న‌క‌ను రెండు ఫార్మాట్ల‌కు ఎంపిక చేయ‌డం విశేషం. ష‌న‌క త‌న చివ‌రి మ్యాచ్‌ను 2024 జ‌న‌వ‌రిలో ఆడాడు.

Read: ఆసీస్‌తో సిరీస్‌కు పక్కనబెట్టారు.. కట్‌చేస్తే ట్రిపుల్‌ సెంచరీ

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)