'గంభీర్ స‌పోర్ట్‌తో అత‌డిని సెలెక్ట్ చేశారు'.. క్లారిటీ ఇచ్చిన బ్యాటింగ్‌ కోచ్‌

Published on Wed, 01/14/2026 - 18:32

న్యూజిలాండ్‌తో ఆఖ‌రి రెండు వ‌న్డేల‌కు భార‌త జ‌ట్టులో ఢిల్లీ బ్యాట‌ర్ అయూశ్ బ‌దోనికి చోటు ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. స్టార్ ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుందర్ గాయం కార‌ణంగా సిరీస్ మ‌ధ్య‌లోనే వైదొల‌గ‌డంతో బ‌దోనికి సెల‌క్ట‌ర్లు పిలుపునిచ్చారు.

అయితే సెలెక్ట‌ర్ల నిర్ణ‌యంపై  భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫామ్‌లో ఉన్న రియాన్ ప‌రాగ్, రింకూ సింగ్ వంటి ఆట‌గాళ్ల‌ని కాద‌ని బదోనిని తీసుకోవడాన్ని చాలా మంది త‌ప్పుబ‌డుతున్నారు. గంభీర్ స‌పోర్ట్ వ‌ల్లే అత‌డిని అనుహ్యంగా జ‌ట్టులోకి తీసుకున్నారని మ‌రికొంత‌మంది విమ‌ర్శిస్తున్నారు.

కాగా బ‌దోని ఐపీఎల్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ర‌పున ఆడ‌తున్నాడు. గ‌తంలో ల‌క్నో మెంటార్‌గా గౌతీ ప‌నిచేశాడు. అత‌డి గైడెన్స్‌లో బ‌దోని మ‌రింత రాటుదేలాడు. అంతేకాకుండా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో బ‌దోని ఢిల్లీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు.

గంభీర్ కూడా ఢిల్లీ నుంచే జాతీయ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించిన విష‌యం విధితమే. ఈ కార‌ణాల‌తో అయూశ్ వైపు మొగ్గు చూపాడ‌ని నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.  ఇక తాజాగా ఇదే విష‌యంపై  భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. కేవ‌లం అత‌డిని టాలెంట్ ఆధారంగానే జ‌ట్టులోకి తీసుకున్నామ‌ని తెలిపాడు.

"అయూశ్ దేశ‌వాళీ క్రికెట్‌లో నిల‌క‌డ‌గా రాణిస్తున్నాడు. భార‌త్‌-ఎ జ‌ట్టు త‌ర‌పున కూడా అత‌డు వ‌న్డే మ్యాచ్‌లు ఆడాడు. బ‌దోని బ్యాటింగ్‌తో పాటు ఆఫ్ బ్రేక్ బౌలింగ్ కూడా చేయ‌గ‌ల‌డు. కేవ‌లం ఐదుగురు బౌల‌ర్ల‌తో మాత్రమే ఆడ‌డం స‌రైన నిర్ణ‌యం కాదు.

ఒకవేళ ప్రధాన బౌలర్లలో ఎవరైనా మ్యాచ్ మధ్యలో గాయపడితే, ఆ ఓవర్లను భర్తీ చేయడానికి ఆరో బౌలింగ్ ఆప్షన్ ఖచ్చితంగా ఉండాలి. బ‌దోని అవసరమైతే 3 నుండి 5 ఓవర్ల వరకు బౌలింగ్ చేయగలడు. అందుకే అత‌డిని జ‌ట్టులోకి తీసుకున్నాము" అని రెండో వ‌న్డేకు ముందు విలేక‌రుల స‌మావేశంలో కోటక్ పేర్కొన్నాడు.
చదవండి: BBL: పాక్‌ ప్లేయర్‌కు ఘోర అవమానం.. బ్యాటింగ్ మధ్యలోనే పిలిచేశారు

Videos

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)