కోపంతో ఊగిపోయిన సిరాజ్‌.. ఇదేంటి మియా?.. ఇలాగేనా ప్రవర్తించేది?

Published on Mon, 05/26/2025 - 08:53

గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj)కు కోపమొచ్చింది. సహచర ఆటగాడిపై మైదానంలోనే అతడు కోపంతో ఊగిపోయాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK)తో ఆదివారం నాటి మ్యాచ్‌ సందర్భంగా ఈ ఘటన జరిగింది. విషయమేమిటంటే..

చేదు అనుభవం
ఐపీఎల్‌-2025 (IPL 2025) లీగ్‌ దశ ఆఖరి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. సొంత మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో శుబ్‌మన్‌ సేన 83 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగాలంటే మిగిలిన మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి.

అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌ ఆది నుంచే గుజరాత్‌కు కలిసిరాలేదు. టాస్‌ గెలిచిన సీఎస్‌కే తొలుత బ్యాటింగ్‌కు దిగి.. 230 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు ఆయుశ్‌ మాత్రే (17 బంతుల్లో 34), డెవాన్‌ కాన్వే (35 బంతుల్లో 52) శుభారంభం అందించగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఉర్విల్‌ పటేల్‌ (19 బంతుల్లో 37) దానిని కొనసాగించాడు.

 

ఇక శివం దూబే (8 బంతుల్లో 17) కాసేపు మెరుపులు మెరిపించగా.. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (23 బంతుల్లో 57) ధనాధన్‌ దంచికొట్టాడు. రవీంద్ర జడేజా (18 బంతుల్లో 21 నాటౌట్‌) కూడా ఈసారి ఫర్వాలేదనిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై ఐదు వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది.

అదనపు పరుగులు
కాగా సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో ఐదో ఓవర్‌ను సిరాజ్‌ వేశాడు. ఈ క్రమంలో ఐదో బంతిని ఎదుర్కొన్న ఉర్విల్‌ పటేల్‌.. మిడాఫ్‌ దిశగా బాల్‌ను తరలించాడు. కాన్వేతో కలిసి సింగిల్‌ పూర్తి చేసుకున్నాడు. అయితే, కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ డైరెక్ట్‌ త్రో ద్వారా వికెట్లను గిరాటేయాలని చూడగా.. మిస్‌ ఫీల్డ్‌ అయింది. ఓవర్‌ త్రో కారణంగా చెన్నై మరో పరుగు తీయగలిగింది.

ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. గిల్‌ వేసిన ఓవర్‌ త్రోను అందుకునేందుకు స్క్వేర్‌ లెగ్‌ వద్ద నుంచి పరిగెత్తుకు వచ్చిన ఆర్‌. సాయి కిషోర్‌ బంతిని అందుకుని మిడ్‌ వికెట్‌ వద్ద కలెక్ట్‌ చేసుకున్నాడు. అనుకోకుండా బంతి అతడి నుంచి చేజారగా.. ఇంతలో సీఎస్‌కే బ్యాటర్లు మూడో పరుగు కూడా పూర్తి చేసుకున్నారు.

ఇదేంటి మియా? ఇలాగేనా ప్రవర్తించేది?
దీంతో కోపోద్రిక్తుడైన సిరాజ్‌ కిషోర్‌ను ఉద్దేశించి గట్టిగానే తిట్టినట్లు కనిపించింది. అంతేకాదు.. బంతిని కూడా గ్రౌండ్‌కేసి కొడుతూ తన ఆగ్రహం వెళ్లగక్కాడు. ఇంతలో గిల్‌ వచ్చి సిరాజ్‌ భుజం తడుతూ నచ్చజెప్పాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ నేపథ్యంలో కామెంటేటర్‌ రవిశాస్త్రి స్పందిస్తూ.. ‘‘ఇదేంటి మియాన్‌’’ అంటూ ఇలాగేనా ప్రవర్తించేది? అన్నట్లుగా కాస్త అసహనం వ్యక్తం చేశాడు.  కాగా లక్ష్య ఛేదనలో ఆది నుంచే తడబడిన గుజరాత్‌... 18.3 ఓవర్లలో కేవలం 147 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. 

చదవండి: చ‌రిత్ర సృష్టించిన సునీల్ నరైన్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)