Breaking News

గౌరవ పదవులు పొందిన భారత స్టార్‌ క్రికెటర్లు వీరే..!

Published on Tue, 11/11/2025 - 21:20

క్రికెట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి, భారత ఖ్యాతిని విశ్వానికి చాటిన పలువురు క్రికెటర్లు క్రికెటేతర గౌరవ పదవులు దక్కించుకున్నారు. ఈ అంశం ప్రస్తావనకు రాగానే ముందుగా గుర్తొచ్చే పేరు ఎంఎస్‌ ధోని. 

  • ఈ టీమిండియా మాజీ కెప్టెన్‌ భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు (2007, 2011) అందించాడు. ఇందుకు గానూ ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీ లెఫ్టినెంట్ కర్నల్ హోదా కల్పించింది.

  • 1983 భారత్‌కు తొలి ప్రపంచకప్‌ అందించిన కపిల్‌ దేవ్‌‌కు (2008) సైతం భారత ఆర్మీ లెఫ్టినెంట్ కర్నల్ హోదా కల్పించింది.

  • భారత క్రికెట్‌కు విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చిన సచిన్‌ టెండూల్కర్‌కు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్‌ కెప్టెన్‌ హెదాతో సత్కరించింది. విమానయాన అనుభవం లేకుండా IAF గ్రూప్ కెప్టెన్ గౌరవం దక్కించుకున్న తొలి వ్యక్తి సచిన్‌ టెండూల్కర్‌.

వీరి తర్వాత పలువురు క్రికెటర్లకు పోలీస్‌ శాఖలో డీఎస్పీ హోదాలో ఉద్యోగాలు లభించాయి. 

  • 2007 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన జోగిందర్‌ శర్మకు హర్యానా పోలీస్‌ శాఖ డీఎస్పీ హోదా కల్పించింది.

  • ఆతర్వాత హర్భజన్‌ సింగ్‌ (2011 ప్రపంచకప్‌ విజేత), మహ్మద్‌ సిరాజ్‌లకు (2024 టీ20 ప్రపంచకప్‌ విజేత) పంజాబ్‌, తెలంగాణ ప్రభుత్వాలు డీఎస్పీ ఉద్యోగాలతో గౌరవించాయి.

  • మహిళల విభాగంలో ప్రస్తుత టీమిండియా సభ్యులు, వన్డే ప్రపంచకప్‌ ఛాంపియన్లు అయిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (పంజాబ్‌), దీప్తి శర్మ (ఉత్తర్‌ప్రదేశ్‌), తాజాగా రిచా ఘోష్‌కు (పశ్చిమ బెంగాల్‌) ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు డీఎస్పీ హోదా కల్పించాయి.    

  • వీరే కాక మరో ముగ్గురు భారత క్రికెటర్లకు ఇతర ప్రభుత్వ శాఖల్లో కీలక ఉద్యోగాలు లభించాయి. ప్రస్తుత టీమిండియా స్టార్‌ కేఎల్‌ రాహుల్‌కు 2018లో స్పోర్ట్స్ కోటాలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగం లభించింది.

  • కొంతకాలం క్రితం భారత క్రికెట్‌లో ఓ వెలుగు వెలిగిన ఫాస్ట్‌ బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌కు కూడా RBIలో అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగం లభించింది.

  • టీమిండియా స్పిన్‌ మాంత్రికుడు యుజ్వేంద్ర చహల్‌కు ఆదాయపు పన్ను శాఖలో అధికారిగా ఉద్యోగం లభించింది. వీరు మాత్రమే కాక చాలామంది భారత క్రికెటర్లకు వేర్వేరు ప్రభుత్వ విభాగాల్లో మంచి ఉద్యోగాలు లభించాయి. 

చదవండి: విరాట్‌ కోహ్లి రికార్డు సమం చేసిన బాబర్‌ ఆజమ్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)