Breaking News

భారత్‌పై అదరగొట్టాడు.. ఐసీసీ అవార్డు రేసులోకి వచ్చాడు

Published on Fri, 12/05/2025 - 16:01

సౌతాఫ్రికా స్టార్ స్పిన్నర్ సైమన్ హార్మర్ పురుషుల విభాగంలో నవంబర్ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. గత నెలలో భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో తన అద్భుత ప్రదర్శన కారణంగానే అతడు ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు.

అతడితో పాటు ఈ జాబితాలో బంగ్లా దేశ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాం, పాకిస్తాన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నవాజ్ ఉన్నారు. అయితే  ఈ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు రేసులో భార‌త నుంచి మెన్స్ క్రికెట‌ర్ ఒక్క‌రూ కూడా లేక‌పోవ‌డం గ‌మనార్హం.

దుమ్ములేపిన హార్మర్‌..
సైమన్ హార్మర్ ఆలస్యంగా అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చినా.. జాతీయ జట్టు తరఫున ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. భారత్‌తో జరిగిన సిరీస్‌లో అతడు బంతితో మ్యాజిక్ చేశాడు. అతడి స్పిన్ వలలో చిక్కుకుని భారత బ్యాటర్లు విల్లవిల్లాడారు.

హార్మ‌ర్ మొత్తంగా 17 వికెట్లు ప‌డ‌గొట్టి భార‌త్ గ‌డ్డ‌పై దక్షిణాఫ్రికా చారిత్రక సిరీస్ విజయాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అంతక‌ముందు పాక్‌తో సిరీస్‌లో కూడా హార్మ‌ర్ 13 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక మ‌హిళ‌ల విభాగంలో ఈ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డుకు భార‌త స్టార్ ఓపెన‌ర్ షెఫాలీ వ‌ర్మ నామినేట్ అయ్యింది. 

గ‌త నెల‌లో జ‌రిగిన ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌ల‌లో షెఫాలీ ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టింది. ఈ ఫైన‌ల్‌లో పోరులో బ్యాటింగ్‌లో 87 ప‌రుగులు చేసిన షెఫాలీ.. అనంత‌రం బౌలింగ్‌లో సునే లూస్, మరిజానే కాప్ వంటి కీలక వికెట్లను పడగొట్టింది. ఆమెతో పాటు ఈ లిస్ట్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన ఎడమచేతి స్పిన్నర్ తిపట్చా పుత్తావోంగ్, యూఏఈ కెప్టెన్ ఇషా ఓజా కూడా ఉన్నారు.
చదవండి: ఇదేం పిచ్చి?.. టికెట్ల కోసం ప్రాణాలకు తెగిస్తారా?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)