'పాక్‌లో ఉన్నప్పుడు జైళ్లో ఉన్నట్లుగా అనిపించింది'

Published on Thu, 04/13/2023 - 19:50

న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)లో వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌ 16వ సీజన్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే పీఎస్‌ఎల్‌ జరుగుతున్న సమయంలోనే ఒక మ్యాచ్‌ లైవ్‌లో బాబర్‌ ఆజంపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాక్‌ క్రికెట్‌ అభిమానులు అతనిపై ఆగ్రహం వ్య‍క్తం చేశారు. సైమన్‌ డౌల్‌ బయటికి వస్తే తమ చేతిలో దెబ్బలు తినడం ఖాయమని బెదిరించారు.

దీంతో పీఎస్‌ఎల్‌ నిర్వాహకులు టోర్నీ ముగిసేవరకు సైమన్‌ డౌల్‌ను బయటకు వెళ్లడానికి అనుమతించలేదు. మ్యాచ్‌లు లేనప్పుడు హోటల్‌ రూంకే పరిమితమైన సైమన్‌ డౌల్‌ పీఎస్‌ఎల్‌ కోసం పాకిస్తాన్‌లో ఉన్నప్పుడు జైళ్లో ఉన్నట్లుగా అనిపించిందని పేర్కొన్నాడు.

"పాకిస్థాన్ లో ఉన్నప్పుడు జైల్లో ఉన్నట్లే అనిపించింది. బాబర్ ఆజం అభిమానులు నన్ను టార్గెట్ చేయడంతో నన్ను కనీసం బయటకు వెళ్లడానికీ అనుమతించలేదు. చాలా రోజుల పాటు కనీసం తిండి కూడా తినకుండా పాకిస్థాన్ లో ఉన్నాను. నన్ను మానసికంగా హింసించారు. దేవుని దయ వల్ల ఎలాగోలా పాకిస్థాన్ నుంచి బయటపడ్డాను" అని సైమన్ డౌల్ పేర్కొన్నాడు.

బాబర్ ఆజం స్ట్రైక్ రేట్ ను ఉద్దేశించి డౌల్ గతంలో వివాదాస్పద కామెంట్స్ చేశాడు. అతడు కేవలం వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడతాడని విమర్శించాడు. ఈమధ్యే విరాట్ కోహ్లిని కూడా డౌల్ ఇలాగే విమర్శించాడు. ఐపీఎల్లో అతని స్ట్రైక్ రేట్ సరిగా లేదని, విరాట్ కూడా కేవలం రికార్డుల కోసమే ఆడతాడని డౌల్ అన్నాడు. ఈ కామెంట్స్ పై కూడా ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి.

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)