స్కై, కేన్‌లకు టీ20, టెస్ట్‌ ప్లేయర్‌ అవార్డులు.. శుభ్‌మన్‌కు డబుల్‌ ధమాకా

Published on Tue, 08/22/2023 - 16:11

2023 CEAT క్రికెట్‌ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిన్న (ఆగస్ట్‌ 21) దేశ వాణిజ్య రాజధాని ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి క్రికెట్‌తో పాటు ఇతర రంగాలకు చెందిన చాలామంది సెలెబ్రిటీలు హాజరయ్యారు. ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో (మూడు ఫార్మాట్లలో) అత్యుత్తమ ప్రదర్శన (రేటింగ్స్‌ ఆధారంగా) కనబర్చిన ఆటగాళ్లను CEAT జ్యూరీ అవార్డులకు ఎంపిక చేసింది.  

టీ20 బ్యాటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ ఎంపిక కాగా.. టెస్ట్‌ బ్యాటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును న్యూజిలాండ్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ దక్కించుకున్నాడు. టీమిండియా డాషింగ్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ వన్డే బ్యాటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డుతో పాటు ఇంటర్నేషనల్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డులను సొంతం చేసుకున్నాడు. గిల్‌కు ఈ రెండు అవార్డులను టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అందజేశాడు. 

ఈ ఏడాది వన్డేల్లో భీకర ఫామ్‌లో ఉన్న గిల్‌.. ఇప్పటివరకు జరిగిన 12 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 2 హాఫ్‌ సెంచరీల సాయంతో 750 పరుగులు చేయగా.. స్కై.. ఈ ఏడాది ఇప్పటివరకు ఆడిన 10 టీ20ల్లో 433 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు టీమిండియా స్టార్లు గతేడాది సైతం ఆయా ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. ముఖ్యంగా స్కై 2022లో టాప్‌ టీ20 రన్స్‌ స్కోరర్‌గా (187.43 స్ట్రయిక్‌రేట్‌తో 46.56 సగటున 1164 పరుగులు) నిలిచాడు. ఇందులో 68 సిక్సర్లు ఉన్నాయి. 

CEAT అవార్డులు గెలుచుకున్న ఇతరుల వివరాలు..

  • టీ20 బౌలర్‌ ఆఫ్‌ ద ఇయర్‌: భువనేశ్వర్‌ కుమార్‌
  • ఇన్నోవేటెడ్‌ కోచ్‌ ఆఫ్‌ ద ఇయర్‌: బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ 
  • వుమెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌: దీప్తి శర్మ

సునీల్‌ గవాస్కర్‌ చేతుల మీదుగా దీప్తి శర్మ అవార్డును అందుకుంది.

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)