Breaking News

గిల్ నీకు కొంచ‌మైన తెలివి ఉందా.. ఇంత చెత్తగా ఔట్ అవుతావా? వీడియో

Published on Thu, 07/24/2025 - 08:52

ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో ఘోరంగా విఫ‌ల‌మైన టీమిండియా కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్.. ఇప్పుడు మాంచెస్ట‌ర్‌లో కూడా అదే తీరును క‌న‌బ‌రిచాడు.  మాంచెస్ట‌ర్ వేదిక‌గా బుధ‌వారం ఇంగ్లీష్ జ‌ట్టుతో ప్రారంభ‌మైన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో గిల్ తీవ్ర నిరాశ‌ప‌రిచాడు.

రెండో సెష‌న్ య‌శ‌స్వి జైశ్వాల్ ఔట‌య్యాక గిల్ బ్యాటింగ్‌కు దిగాడు. ఈ క్ర‌మంలో గిల్ మైదానంలో అడుగుపెట్ట‌గానే ఇంగ్లండ్ అభిమానులు గ‌ట్టిగా అరుస్తూ గేలి చేశారు.లార్డ్స్ టెస్టులో గిల్ వ్యవహరించిన తీరు కారణంగా ఇంగ్లీష్ జట్టు అభిమానులు ఇలా చేశారు. 

అయితే ఈ మ్యాచ్‌లో గిల్ ఔటైన తీరుపై నెటిజ‌న్లు ఫైర‌వ‌తున్నారు.  ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ట్రాప్‌లో గిల్ చిక్కుకున్నాడు. భార‌త ఇన్నింగ్స్ 50వ ఓవ‌ర్ వేసిన స్టోక్స్.. తొలి బంతిని గిల్‌కు అద్బుత‌మైన ఇన్‌స్వింగ‌ర్‌గా సంధించాడు. అయితే బంతిని అంచ‌నా వేయ‌డంలో గిల్ విఫ‌ల‌మ‌య్యాడు.

ఆ ఇన్‌స్వింగ‌ర్ బంతిని గిల్ ఆడ‌కుండా వ‌దిలేశాడు. కానీ బంతి అద్భుతంగా ట‌ర్న్అయ్యి గిల్ ప్యాడ్‌కు తాకింది. వెంట‌నే బౌల‌ర్‌తో పాటు ఫీల్డ‌ర్లు ఎల్బీకి అప్పీల్ చేశారు. వెంట‌నే అంపైర్ రాడ్ ట‌క్క‌ర్ ఔట్ అంటూ వేలు పైకెత్తాడు.

దీంతో గిల్ నాన్‌స్ట్రైక్‌లో ఉన్న సాయిసుద‌ర్శ‌న్‌తో మాట్లాడి రివ్యూ తీసుకున్నాడు. రిప్లేలో బంతి ఆఫ్‌స్టంప్‌కు తాకిన‌ట్లు తేలింది. దీంతో 12 ప‌రుగులు చేసిన‌ గిల్ మైదానాన్ని వీడక త‌ప్ప‌లేదు. ఈ క్ర‌మంలో ఇంగ్లండ్ బ‌ర్మి ఆర్మీ గిల్‌ను ట్రోలు చేసింది. 

"గిల్ స‌మ‌యాన్ని తన వృధా చేయకుండా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడ‌ని" ఎక్స్‌లో పోస్ట్ చేసింది. తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ 77 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 245 ప‌రుగులు చేసింది. క్రీజులో ర‌వీంద్ర జ‌డేజా(19), శార్ధూల్ ఠాకూర్‌(19) ఉన్నారు
 



 

 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)