Breaking News

'చెప్పి మరి సిక్సర్‌ కొట్టడం సంతోషంగా అనిపించింది'

Published on Tue, 05/16/2023 - 18:25

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా సోమవారం ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్(58 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 101) సెంచరీ చేశాడు. ఐపీఎల్‌లో గిల్‌కు ఇదే తొలి శతకం. కాగా తన సెంచరీతో గుజరాత్‌ విజయంలో కీలకపాత్రో పోషించిన గిల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. అవార్డు అందుకున్న సమయంలో తన ఇన్నింగ్స్ గురించి గిల్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌తో మ్యాచ్ ఆడితే తనకు పూనకాలు వస్తాయని తెలిపాడు. సన్ రైజర్స్ తోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన తాను.. ఇప్పుడు సెంచరీ కూడా అందుకున్నాని చెప్పాడు. భవిష్యత్ లో మరిన్ని సెంచరీలు సాధిస్తానని అన్నాడు. 

''అభిషేక్ శర్మబౌలింగ్‌లో కొట్టిన సిక్స్ హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అతనికి ముందే చెప్పాను. నువ్వు బౌలింగ్ వేస్తే సిక్స్ కొడతానని. అన్నట్లుగానే సిక్స్ కొట్టాను.'' అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు. దేశవాళీ క్రికెట్లో అభిషేక్ శర్మ, శుభ్ మన్ గిల్ పంజాబ్ కు ఓపెనర్లుగా ఆడుతారు. ఈ చనువుతోనే గిల్ ఈ కామెంట్స్ చేశాడు.

తనకు సచిన్ టెండూల్కర్, విరాట్‌ కోహ్లి ఆరాధ్య క్రికెటర్లని చెప్పిన గిల్.. వారి వల్లే క్రికెటర్ అయ్యానని చెప్పుకొచ్చాడు. తనకు క్రికెట్ అర్ధమైనప్పటి నుంచి కోహ్లీ నా హీరో. ఆట పట్ల అతడికి ఉన్న పిచ్చి, అంకితభావం, ఎనర్జీ నన్ను చాలా.. ప్రోత్సహించాయి. ఆటపై ఎంతో మక్కువ చూపేలా చేశాయని శుభ్‌మన్ గిల్ చెప్పాడు.

ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులు చేసింది. శుభ్‌మన్‌కు తోడుగా సాయి సుదర్శన్(36 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 47)రాణించాడు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 5 వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, ఫరూఖీ, నటరాజన్ తలో వికెట్ తీశారు. లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 154 పరుగులే చేసి ఓటమిపాలైంది.

చదవండి: గుజరాత్‌ ఇప్పటికే; పోటీలో ఏడుజట్లు.. ప్లేఆఫ్స్‌కు వెళ్లేదెవరు? 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)