Breaking News

చ‌రిత్ర సృష్టించిన రాహుల్‌-గిల్ జోడీ.. ప్రపంచంలోనే

Published on Sun, 07/27/2025 - 11:39

మాంచెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫ‌ర్డ్‌లో ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న నాలుగో టెస్టును డ్రాగా ముగించేందుకు టీమిండియా పోరాడుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ త‌మ సెకెండ్ ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 174 ప‌రుగులు చేసింది.

311 ప‌రుగుల లోటుతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భార‌త్‌కు ఆదిలోనే క్రిస్ వోక్స్ బిగ్ షాకిచ్చాడు. ఒకే ఓవ‌ర్‌లో వ‌రుస బంతుల్లో య‌శ‌స్వి జైశ్వాల్‌(0), సాయిసుద‌ర్శ‌న్‌(0) పెవిలియ‌న్‌కు పంపాడు. భార‌త్ సున్నా ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. దీంతో నాలుగో రోజే భార‌త క‌థ ముగుస్తుంద‌ని అంతా భావించారు.

కానీ కేఎల్ రాహుల్‌(87 బ్యాటింగ్‌), శుబ్‌మ‌న్ గిల్‌(78 నాటౌట్‌) త‌మ అద్బుత బ్యాటింగ్‌తో అడ్డుగోడ‌గా నిలిచారు. వీరిద్ద‌రూ 62 ఓవ‌ర్లు పాటు త‌మ వికెట్‌ను కోల్పోకుండా బ్యాటింగ్ చేశారు. ఈ క్ర‌మంలో గిల్‌-రాహుల్ జోడీ ప‌లు అరుదైన ఘ‌న‌తల‌ను త‌మ పేరిట లిఖించుకున్నారు.

తొలి జోడీగా
ఒక టెస్టు మ్యాచ్‌లో 'సున్నా' ప‌రుగుల‌కే 2 వికెట్లు కోల్పోయిన త‌ర్వాత థ‌ర్డ్ వికెట్‌కు అత్య‌ధిక భాగ‌స్వామ్యం నెల‌కొల్పిన జోడీగా గిల్‌-రాహుల్ వరల్డ్‌ రికార్డు సృష్టించారు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రికార్డు దిగ్గ‌జాలు మొహిందర్ అమర్నాథ్, గుండప్ప విశ్వనాథ్ పేరిట ఉండేది.

1977లో ఆస్ట్రేలియాపై ఇటువంటి ప‌రిస్థితుల్లో వీరిద్ద‌రూ మూడో వికెట్‌కు 105 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెలకొల్పారు. అయితే తాజా మ్యాచ్‌లో మూడో వికెట్‌కు 174 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పిన రాహుల్‌-గిల్ జంట 49 ఏళ్ల త‌ర్వాత‌ ఈ రేర్ ఫీట్‌ను బ్రేక్ చేసింది.

కాగా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న ప్ర‌స్తుత టెస్టు సిరీస్‌లో శుబ్‌మ‌న్ గిల్‌, రాహుల్ ఇద్ద‌రూ 500 ప‌రుగుల మార్క్‌ను దాటేశారు. ఈ సిరీస్‌లో గిల్ ఇప్ప‌టివ‌ర‌కు  697 ప‌రుగులు చేయ‌గా.. రాహుల్ 508 ర‌న్స్ చేశాడు. విదేశీ గడ్డపై ఒక టెస్ట్ సిరీస్‌లో ఇద్దరు భారత బ్యాటర్లు 500కు పైగా పరుగులు చేయడం గత 54 ఏళ్లలో ఇదే మొదటిసారి. 

వీరికంటే ముదు  1970-71 విండీస్ ప‌ర్య‌ట‌న‌లో భార‌త మాజీ క్రికెట‌ర్లు సునీల్ గవాస్కర్, దిలీప్ సర్దేశాయ్ ఈ ఫీట్ సాధించారు. ఆ సిరీస్‌లో సునీల్ గవాస్కర్ (774), దిలీప్ సర్దేశాయ్ (642) ప‌రుగులు చేశారు.
చదవండి: IND vs ENG: షాకింగ్‌.. 'జ‌స్ప్రీత్ బుమ్రా త్వ‌ర‌లోనే రిటైర్మెంట్‌'
 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?