Breaking News

చరిత్ర సృష్టించిన జైశ్వాల్‌-గిల్‌ జోడీ.. ఐదేళ్ల తర్వాత!

Published on Sun, 08/13/2023 - 07:46

ఫ్లోరిడా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో 9 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-2తో సమం చేసింది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. షిమ్రాన్‌ హెట్‌మైర్‌ (39 బంతుల్లో 61; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), షై హోప్‌ (29 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ మూడు వికెట్లు, కుల్దీప్‌ యాదవ్‌ రెండు, ముఖేష్‌ ​కుమార్‌, చాహల్‌ తలా వికెట్‌ సాధించారు.

ఓపెనర్ల విధ్వంసం​..
179 పరుగుల భారీ భారీ లక్ష్యాన్ని టీమిండియా కేవలం 17 ఓవర్లలోనే ఊదిపడేసింది. లక్ష్య ఛేదనలో భారత యువ ఓపెనర్లు శుబ్‌మన్‌ గిల్‌, యశస్వీ జైశ్వాల్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. విండీస్‌ బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. యశస్వి జైస్వాల్‌ (51 బంతుల్లో 84 నాటౌట్‌; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు), శుబ్‌మన్‌ గిల్‌ (47 బంతుల్లో 77; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అదరగొట్టారు. 

రోహిత్‌-రాహుల్‌ రికార్డు సమం..
ఈ మ్యాచ్‌లో దుమ్మురేపిన జైశ్వాల్‌, గిల్‌ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20ల్లో భారత తరపున రెండో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జంటగా గిల్‌, జైశ్వాల్‌ నిలిచారు. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ-రాహుల్‌ రికార్డును ఈ యువ జోడీ సమం చేసింది.

2017లో ఓ టీ20 మ్యాచ్‌లో శ్రీలంకపై రోహిత్‌-రాహుల్‌ కూడా 165 పరుగుల భాగస్వామే నెలకొల్పారు. ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో దీపక్‌ హుడా-సంజూ శాంసన్‌ జోడి అగ్రస్ధానంలో ఉంది. 2022లో ఐర్లాండ్‌పై హడా, సంజూ ఏకంగా 176 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
చదవండిIND vs WI: చెలరేగిన ఓపెనర్లు.. నాలుగో టీ20లో భారత్‌ ఘన విజయం

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు