'మాకు రూల్స్‌ తెలుసు.. చాలా క్రికెట్‌ ఆడాము'.. పిచ్‌ క్యూరేటర్‌పై గిల్‌ ఫైర్‌

Published on Thu, 07/31/2025 - 11:04

ఇంగ్లండ్‌-భార‌త్ మ‌ధ్య ఐదో టెస్టు మ్యాచ్‌ ప్రారంభానికి ముందే అందరి దృష్టిని ఆకర్షించింది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఓవల్ పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మంగ‌ళవారం పిచ్ ను ప‌రిశీలిస్తున్న భార‌త బృందం ద‌గ్గ‌రికి వ‌చ్చిన ఫోర్టిస్.. పిచ్ ను రెండున్న‌ర మీట‌ర్ల దూరం నుంచి ప‌రిశీలించాల‌ని సూచించాడు.

అతడి మాటలకు గంభీర్‌కు చిర్రెత్తుకు వచ్చింది. ఈ క్రమంలో ప్రధాన కోచ్ పిచ్ క్యూరేటర్‌తో వాగ్వాదానికి దిగాడు. అక్కడే ఉన్న భారత బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కోటక్ సైతం లీ ప్రవర్తన పట్ల అసహనం వ్యక్తం చేశాడు. తాజాగా ఈ వివాదంపై టీమిండియా కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ స్పందించాడు. లీ ఫోర్టిస్‌పై గిల్ అగ్రహం వ్యక్తం చేశాడు.

"నా కెరీర్‌లో చాలా మ్యాచ్‌లు ఆడాను. మ్యాచ్‌కు ముందు ప్రధాన పిచ్‌ను రెండున్న‌ర మీట‌ర్ల దూరం నుంచి ప‌రిశీలించాల‌ని ఇప్పటివరకు  ఏ క్యూరేటర్ కూడా నాతో చెప్పలేదు.  ర‌బ్బ‌ర్ స్పైక్స్ లేదా బేర్ ఫూట్(చెప్పులు లేకుండా) తో పిచ్‌ను దగ్గరగా వెళ్లి పరిశీలించవచ్చు. మాకు రూల్స్‌ తెలుసు.

ఒకవేళ స్పైక్స్ ఉన్న షూల‌ను వేసుకున్న‌ట్ల‌యితే క్యూరేటర్ మమ్మల్ని అడ్డుకోవచ్చు. కానీ మేము అటువంటి షూలను ధరించలేదు. అయినా క్యూరేటర్ మమ్మల్ని ఎందుకు ఆపాడో ఆర్ధం కావడం లేదు. మేము ఇప్పటివరకు ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడాము. ఏ క్యూరేటర్ కూడా మాకు ఇలాంటి సూచనలు ఇవ్వలేదు" అని ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గిల్ పేర్కొన్నాడు.

కాగా ఐదో టెస్టు గురువారం నుంచి ఓవ‌ల్ మైదానం వేదిక‌గా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను స‌మం చేసుకోవాలని భార‌త్ భావిస్తుంటే.. ఇంగ్లండ్ మాత్రం ఎలాగైనా ప‌ర్య‌టక జ‌ట్టును ఓడించి 3-1 తేడాతో సిరీస్ ద‌క్కించుకోవాల‌ని ప‌ట్టుద‌లతో ఉంది.
చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు.. అర్ష్‌దీప్ అరంగేట్రం! అత‌డికి మ‌రోసారి నో ఛాన్స్‌?

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)