Breaking News

అన్ని ఆలోచించే ఆ నిర్ణయం తీసుకున్నాము.. సంతోషంగా ఉంది: గిల్‌

Published on Tue, 10/14/2025 - 12:42

శుభ్‌మన్ గిల్‌.. టీమిండియా కెప్టెన్‌గా తొలి సిరీస్ విజయాన్ని అందుకున్నాడు. ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను భారత్ చిత్తు చేసింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో గిల్ సారథ్యంలో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది.

ఢిల్లీ టెస్టులో భారత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. యశస్వి జైశ్వాల్‌(175), శుభ్‌మన్ గిల్(129), సాయిసుదర్శన్‌(87) బ్యాటింగ్‌లో సత్తాచాటగా.. కుల్దీప్ యాదవ్‌( 8 వికెట్లు), జడేజా(4 వికెట్లు), జస్పీత్ బుమ్రా (4) బౌలింగ్‌లో మాయ చేశారు. ఇక విజయంపై మ్యాచ్ అనంతరం గిల్ స్పందించాడు. తన నాయకత్వ అనుభవం, జట్టు వ్యూహాలపై గిల్  మాట్లాడాడు.

"భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. కెప్టెన్‌గా తొలి సిరీస్ విజయాన్ని అందుకోవడం  చాలా సంతోషంగా ఉంది. ప్రతీ ఆటగాడితో కలిసి పనిచేయడం, జ‌ట్టును న‌డిపించ‌డం వంటివి నేను నేర్చుకుంటున్నాను.

పరిస్థితులకు తగ్గ నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తాను. కొన్ని సందర్భాల్లో ధైర్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మరి కొన్ని సార్లు ఎక్స్-ఫాక్టర్ ఆటగాళ్లను రంగం దించాల్సి వవస్తుంది. ఏ ఆటగాడైతే పరుగులు లేదా వికెట్లు అందించగలడో వారిని ఎక్స్‌-ఫాక్టర్‌గా ఉపయోగించుకోవాలి" అని గిల్ చెప్పుకొచ్చాడు.

ఫాలో-ఆన్‌ నిర్ణయం గురించి మాట్లాడుతూ.. "విండీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మేము సుమారు 300 పరుగుల ఆధిక్యంలో ఉన్నాం. ఐదో రోజున వికెట్లు తీయడం కష్టం అవుతుందనే భావించి ఫాలో-ఆన్ ఆడించాము. మేము 500 పరుగులు చేసినా.. ఆఖరి రోజు ఆటలో వికెట్లు పడగొట్టడం కష్టమవుతుందని ఫాలో ఆన్‌ను అమలు చేశాము.

నితీష్‌ రెడ్డి గురించి మాట్లాడుతూ .. నితీష్‌కు ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌ చేసే అవకాశం రాలేదు. విదేశాల్లో మాత్రమే కాదు, ఇక్కడ పిచ్‌లపై కూడా అతడిని అలవాటు చేయాలని చూస్తున్నాము. విదేశీ గడ్డపై మ్యాచ్‌లను గెలవడంలో మాకు సహాయపడతారని భావించే కొంతమం‍ది ఆటగాళ్లను మేము ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నాము. ఎందకంటే అక్కడ గెలవడం మాకు ఎల్లప్పుడూ ఒక సవాలుగా ఉంటుంది. 

నేను బ్యాటింగ్‌కు వెళ్లిన‌ప్పుడు కేవ‌లం బ్యాట‌ర్‌గానే ఆలోచిస్తాను.  నేను 3-4 ఏళ్ల వయసు నుంచి బ్యాటింగ్ చేస్తున్నాను. క్రీజులోకి వెళ్లిన ప్ర‌తీసారి జ‌ట్టును  గెలిపించడమే నా లక్ష్యంగా పెట్టుకుంటా. ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించి ఇంకా ఎలాంటి ప్రణాళికలు రచించలేదు. ఫ్లైట్‌లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు న‌వ్వుతూ గిల్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs WI: టీమిండియా వ‌ర‌ల్డ్ రికార్డు..
 

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)