Breaking News

ఆస్పత్రి నుంచి గిల్ డిశ్చార్జ్.. రెండో టెస్టుకు డౌటే

Published on Mon, 11/17/2025 - 08:53

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో మెడకు గాయమైన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ క్రమంగా కోలుకుంటున్నాడు. ఆస్ప్రత్రి నుంచి ఆదివారం గిల్‌ డిశ్చార్జ్‌ అయ్యాడు. అతడు ప్రస్తుతం టీమ్ హోటల్‌లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. 

మెడ గాయం నుంచి కోలుకుంటున్నందున గిల్‌కు విమాన ప్రయాణం చేయవద్దని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. అతడికి కనీసం వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. టీమ్ హోటల్‌లో ఉన్న గిల్ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తుంది.

అయితే ప్రస్తుతం అతడు మెడను ఈజీగా అటూ ఇటూ  కదపగలుగుతున్నాడు. కానీ గౌహతి వేదికగా జరిగే రెండో టెస్టులో అతడు ఆడుతాడా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. కాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే ముందు గిల్‌ను  మాజీ భారత కెప్టెన్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పరామర్శించాడు.

గిల్ ఎలా గాయ‌ప‌డ్డాంటే?
తొలి టెస్టు రెండో రోజు ఆట సంద‌ర్భంగా సైమ‌న్ హార్మ‌ర్ బౌలింగ్‌లో స్లాగ్ స్వీప్ షాట్ ప్ర‌య‌త్నంలో గిల్ మెడ‌ప‌ట్టేసింది. ఫిజియో వ‌చ్చి చికిత్స అందించిన‌ప్ప‌టికి నొప్పి మాత్రం త‌గ్గ‌లేదు. దీంతో అత‌డు  మూడు బంతులు ఆడిన తర్వాత రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. అయితే అత‌డి గాయం తీవ్ర‌త‌రం కావ‌డంతో రెండో రోజు ఆట ముగిసిన త‌ర్వాత కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రికి తరలించారు. గిల్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. 

24 గంట‌ల పాటు వైద్యుల‌ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నాక అత‌డిని ఆస్ప‌త్రి నుంచి  డిశ్చార్జ్ చేశారు. గిల్ రెండు ఇన్నింగ్స్‌ల‌కు దూరం కావ‌డం టీమిండియా కొంప‌ముంచింది. గిల్ లేక‌పోవ‌డంతో భార‌త జ‌ట్టును వైస్ కెప్టెన్ రిష‌బ్ పంత్ ముందుండి న‌డిపించాడు. ఈ మ్యాచ్‌లో 30 ప‌రుగుల తేడాతో భార‌త్ అనుహ్య ఓటమిని చ‌విచూసింది. 124 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని చేధించ‌లేక భార‌త్ చ‌తిక‌ల‌ప‌డింది.
చదవండి: PAK vs SL 3rd Odi: శ్రీలంకను చిత్తు చేసిన పాకిస్తాన్‌..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)