Breaking News

గిల్‌ సూపర్‌ సెంచరీ.. భారీ స్కోర్‌ దిశగా భారత్‌

Published on Sat, 06/06/2026 - 17:06

ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (జూన్‌ 6) ప్రారంభమైన ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న భారత్‌ పరుగుల వరద పారిస్తుంది. ఈ ఇన్నింగ్స్‌లో ఇప్పటికే ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (100) శతక్కొట్టగా.. తాజాగా కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ కూడా సూపర్‌ సెంచరీతో కదంతొక్కాడు. 

గిల్‌ 138 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో మూండకెల మార్కును తాకాడు. ఈ సెంచరీ గిల్‌కు 11వ టెస్ట్‌ సెంచరీ. ఓవరాల్‌గా 20వ అంతర్జాతీయ సెంచరీ. కేవలం​ 26 ఏళ్ల వయసులోనే గిల్‌ ఇన్ని సెంచరీలు చేయడం విశేషం.

అరుదైన ఫీట్‌
టీమిండియా కెప్టెన్‌గా గిల్ టెస్టుల్లో వెయ్యి ప‌రుగుల మార్క్‌ను అందుకున్నాడు. 15 ఇన్నింగ్స్‌ల్లో గిల్‌ ఈ ఫీట్ సాధించాడు. త‌ద్వారా భార‌త్ త‌ర‌ఫున కెప్టెన్‌గా త‌క్కువ ఇన్నింగ్స్‌లో వెయ్యి ప‌రుగుల మార్క్ దాటిన రెండో క్రికెట‌ర్‌గా నిలిచాడు. మొద‌టి స్థానంలో సునీల్ గావ‌స్కర్ (14 ఇన్నింగ్స్‌లు) ఉన్నాడు.

అంతేకాదు కెప్టెన్ అయిన‌ అతి త‌క్కువ రోజుల్లోనే టెస్టుల్లో వెయ్యి ప‌రుగులు పూర్తి చేసిన బ్యాట‌ర్‌గానూ నిలిచాడు. ఇక ఓవరాల్‌గా భారత్‌ తరఫున కెప్టెన్‌గా వెయ్యి పరుగులు చేసిన కెప్టెన్ల జాబితాలో 11వ స్థానంలో నిలిచాడు.

అలాగే అత్యధిక టెస్ట్‌ శతకాలు సాధించిన భారత కెప్టెన్ల జాబితాలో టాప్‌-5లోకి చేరాడు. గిల్‌ భారత టెస్ట్‌ జట్టు కెప్టెన్‌గా 6 శతకాలు సాధించాడు. ఈ జాబితాలో విరాట్‌ కోహ్లి (20) టాప్‌ ప్లేస్‌లో ఉండగా.. సునీల్‌ గవాస్కర్‌ (11), మొహమ్మద్‌ అజహారుద్దీన్‌ (9), సచిన్‌ టెండూల్కర్‌ (7) గిల్‌కు ముందున్నారు. గిల్‌ 6 టెస్ట్‌ శతకాలను కేవలం 15 ఇన్నింగ్స్‌లోనే సాధించడం మరో విశేషం.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ముల్లాన్‌పూర్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ అతి భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి జట్టు స్కోర్‌ 368-3గా ఉంది. రాహుల్‌ (100), యశస్వి జైస్వాల్‌ (24), సాయి సుదర్శన్‌ (81) ఔట్‌ కాగా.. గిల్‌ (103), వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ (50) క్రీజ్‌లో ఉన్నారు. ఆఫ్ఘన్‌ బౌలర్లలో సలీం సాఫి 2, జియా ఉర్‌ షరిఫీ ఓ వికెట్‌ పడగొట్టారు.

 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు