గిల్‌ను కాదు అత‌డిని కెప్టెన్‌గా సెల‌క్ట్ చేయాల్సింది: వీరేంద్ర సెహ్వాగ్‌

Published on Tue, 05/27/2025 - 12:49

ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు ముందు టీమిండియా టెస్టు జ‌ట్టు కెప్టెన్‌గా శుబ్‌మ‌న్ గిల్ ఎంపికైన సంగ‌తి తెలిసిందే. అదేవిధంగా గిల్‌కు డిప్యూటీగా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌బ్ పంత్ నియ‌మితుడ‌య్యాడు. రోహిత్ శ‌ర్మ టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డంతో కొత్త కెప్టెన్ ఎంపిక అనివార్య‌మైంది. 

పలు మీడియా రిపోర్ట్‌లు ప్రకారం.. కెప్టెన్సీ రేసులో నుంచి ఫిట్‌నెస్‌, వ‌ర్క్‌లోడ్ కార‌ణంగా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా త‌ప్పుకోవ‌డంతో గిల్‌కు జ‌ట్టు ప‌గ్గాల‌ను సెల‌క్ట‌ర్లు అప్ప‌గించారు. కాగా భారత సెలక్టర్ల ముందు గిల్‌తో పాటు కేఎల్ రాహుల్‌, రిషబ్ ‍పంత్ అప్షన్స్ కూడా ఉండేవి. 

కానీ జ‌ట్టు దీర్ఘ‌కాల‌క ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో పెట్టుకుని గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్లు బీసీసీఐ ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్ టీమ్ సెలక్షన్ ప్రెస్‌మీట్‌లో తెలిపాడు. అయితే 25 ఏళ్ల గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

తాజాగా ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్‌లు మనోజ్ తివారీ,వీరేంద్ర సెహ్వాగ్‌లు త‌మ మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టారు. ఫిట్‌నెస్‌ సమస్యల కార‌ణంగానే బుమ్రా కాద‌ని గిల్‌కు కెప్టెన్సీ బాధ్య‌తలు అప్ప‌గించ‌రాని తివారీ అన్నాడు.

"భార‌త టెస్టు కెప్టెన్సీకి శుబ్‌మ‌న్ గిల్ సెకెండ్ బెస్ట్ ఆప్ష‌న్‌. సెల‌క్ట‌ర్లకు తొలి ఎంపికగా బుమ్రా ఉండేవాడు. కానీ ఫిట్‌నెస్‌ సమస్యల వల్ల తుదిజట్టులో ఆడలేని వారికి సారథ్య బాధ్యతలు ఎలా అప్పగిస్తారు. అందుకే త‌మ సెకెండ్ అప్ష‌న్ అయిన గిల్‌కు జ‌ట్టు ప‌గ్గాల‌ను క‌ట్ట‌బెట్టారు" అని క్రిక్‌బ‌జ్ లైవ్ షోలో తివారీ పేర్కొన్నాడు. అయితే తివారీ వ్యాఖ్య‌ల‌తో సెహ్వాగ్ విభేదించాడు. గిల్‌ను కాకుండా పంత్ కెప్టెన్‌గా ఎంపిక చేసి ఉంటే బాగుండేద‌ని సెహ్వాగ్ అభిప్రాయ‌ప‌డ్డాడు.

"కేవ‌లం ఒక్క సిరీస్ కోసం అయితే బుమ్రాను కెప్టెన్‌గా సెల‌క్ట్ చేయ‌వ‌చ్చు. అందులో ఎటువంటి స‌మ‌స్య లేదు. కానీ దీర్ఘ‌కాల‌నికి అయితే ఈ నిర్ణ‌యం స‌రైంది కాదు. భార‌త్ ఒక ఏడాది 10 టెస్టులు ఆడితే,  ఆ మ్యాచ్‌ల‌న్నీ బుమ్రా ఆడగలడా అని ఆడ‌గాలి?  లేదా అత‌డు ఎన్ని మ్యాచ్‌ల‌కు అందుబాటులో ఉండ‌గ‌ల‌డు అని ప్ర‌శ్నించాలి. కెప్టెన్‌ను ఎంపిక చేయ‌డంలో అది ఒక ప్రధాన అంశం.

కానీ సెల‌క్ట‌ర్లు ఆ ఒత్తిడిని, వ‌ర్క్‌లోడ్‌ను బుమ్రాపై పెట్టాల‌నుకోలేదు. అందుకే అత‌డిని కెప్టెన్‌గా ఎంపిక చేయ‌లేదు. సెల‌క్ట‌ర్లు తీసుకుంది సరైన నిర్ణయం అని నేను కూడా భావిస్తున్నాను. అయితే కెప్టెన్సీకి గిల్ రెండవ బెస్ట్ ఆప్ష‌న్ అని తివారీ  అన్నారు. నా దృష్టిలో టీమిండియాకు సారథిగా రిషభ్‌ పంత్‌ సెకండ్‌ బెస్ట్‌ ఆప్షన్‌. టెస్ట్‌ క్రికెట్‌కు పంత్‌ చేసినంతగా, ఇతర మరే ఇతర ఆటగాడు చేయలేదు. 

విరాట్ కోహ్లి త‌ర్వాత టెస్టు క్రికెట్ చూసేలా చేసిన ప్లేయ‌ర్ పంత్‌. కారు ప్ర‌మాదం నుంచి కోలుకుని వ‌చ్చిన త‌ర్వాత పంత్ అంత‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోయాడు. దీన్ని నేను కూడా అంగీక‌రిస్తున్నాను. అత‌డు తిరిగి త‌న ఫామ్‌ను అందుకంటే,  భవిష్యత్తులో అతన్ని కెప్టెన్‌గా చేసే నిర్ణయాన్ని సెల‌క్ట‌ర్లు తీసుకొవ‌చ్చు.

అందుకే వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అయితే భార‌త టెస్టు సార‌థిగా చాలా కొద్ది మంది బౌల‌ర్ల‌రే వ్య‌వ‌హ‌రించారు.నేను క్రికెట్‌ ఆడిన కాలంలో కేవలం అనిల్‌కుంబ్లేనే ఈ ఫీట్ సాధించాడు. అదేవిధంగా అన్ని మ్యాచ్‌ల‌కు కూడా అత‌డు అందుబాటులో ఉన్నాడ‌ని" సెహ్వాగ్ విశ్లేషించాడు.
చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్‌..

 

Videos

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)