ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన శుబ్‌మన్‌ గిల్‌.. తొలి ఆటగాడిగా

Published on Tue, 05/30/2023 - 16:22

ఐపీఎల్‌-2023కు సోమవారంతో శుభం కార్డు పడింది. ఈ ఏడాది సీజన్‌ ఛాంపియన్స్‌గా చెన్నైసూపర్‌ కింగ్స్‌ నిలిచింది. ధోని సారధ్యంలోని సీస్‌ఎస్‌కే ఐదోసారి ట్రోఫీని ముద్దాడింది. మరోవైపు వరుసగా రెండోసారి ఛాంపియన్స్‌గా నిలవాలన్న గుజరాత్‌ టైటాన్స్‌ కలనెరవలేదు.

ఈసారి గుజరాత్‌ రన్నరప్‌గా నిలిచింది. ఇక ఈ సీజన్‌లో అదరగొట్టిన గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఆరెంజ్‌ క్యాప్‌ను క్యాప్‌ నెగ్గిన అతి పిన్న వయస్కుడిగా గిల్‌ (23 ఏళ్ల 263 రోజులు) రికార్డులెక్కాడు. గతంలో ఈ రికార్డు చెన్నైసూపర్‌ కింగ్స్‌ ఓపెనర్‌ రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ పేరిట ఉండేది. 

2021 సీజన్‌లో గైక్వాడ్‌ 24 ఏళ్ల వయస్సులో ఈ ఘనత సాధించాడు. తాజా సీజన్‌తో రుత్‌రాజ్‌ రికార్డును బ్రేక్‌చేశాడు. ఇక ఈ ఓవరాల్‌గా ఐపీఎల్‌-2023లో మరికొన్ని అరుదైన రికార్డులు నమోదయ్యాయి. అవి ఏంటో ఓ సారి పరిశీలిద్దాం.

నమోదైన రికార్డులు ఇవే..
ఐపీఎల్‌లో 250 మ్యాచ్‌లు ఆడిన తొలి ప్లేయర్‌గా సీఎస్‌కే కెప్టెన్‌ ధోని రికార్డు నెలకొల్పాడు. 2008 నుంచి మొదలుకొని ధోని వరుసగా 16 సీజన్లు ఆడాడు. 226 మ్యాచ్‌ల్లో అతను కెప్టెన్‌గా చేశాడు. రోహిత్‌ శర్మ (243), దినేశ్‌ కార్తీక్‌ (242), విరాట్‌ కోహ్లి (237), రవీంద్ర జడేజా (226) టాప్‌–5లో ఉన్నారు.  

ఐపీఎల్‌–2023లో అత్యధిక సెంచరీలు(12) నమోదయ్యాయి.  గత ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధికంగా 8 సెంచరీలు వచ్చాయి.  

గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ఐపీఎల్‌ సీజన్‌లో 37 సార్లు ఆయా జట్లు 200 అంతకంటే ఎక్కువ పరుగులు సాధించాయి. గత సీజన్‌లో 18 సార్లు 200 అంతకంటే ఎక్కువ  పరుగులు వచ్చాయి.  

564 ఒక ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా చెన్నై సూపర్‌ కింగ్స్‌కు చెందిన తుషార్‌ దేశ్‌పాండే నిలిచాడు. ఈ సీజన్‌లో తుషార్‌ 16 మ్యాచ్‌లు ఆడి 564 పరుగులు ఇచ్చి 21 వికెట్లు పడగొట్టాడు. గతంలో ఈ రికార్డు ప్రసిధ్‌ కృష్ణ (551 పరుగులు; 2022 సీజన్‌) పేరిట ఉంది. 

ఇప్పటి వరకు జరిగిన 16 ఐపీఎల్‌ ఫైనల్స్‌లో ఏడుసార్లు ఛేజింగ్‌ చేసిన జట్టు చాంపియన్‌గా అవతరించింది. తొమ్మిదిసార్లు తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు విజేతగా నిలిచింది.  

ఐపీఎల్‌ టైటిల్‌ను అత్యధికంగా ఐదుసార్లు గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్‌ (2013, 2015, 2017, 2019, 2020) జట్టు పేరిట ఉన్న రికార్డును చెన్నై సూపర్‌ కింగ్స్‌ (2010, 2011, 2018, 2021, 2023) సమం చేసింది.  

ఇప్పటి వరకు జరిగిన 16 ఐపీఎల్‌ ఫైనల్స్‌ మ్యాచ్‌ల్లో ఏ జట్టు కూడా ఒక్కసారీ ఆలౌట్‌ కాలేదు.  

 6 మొత్తం 16 ఐపీఎల్‌ ఫైనల్స్‌లో ఆరుసార్లు ఆయా జట్లు 200 అంతకంటే ఎక్కువ పరుగులు సాధించాయి.
చదవండి: IPL 2023: చాంపియన్‌గా చెన్నై.. గిల్‌ సరికొత్త చరిత్ర! అవార్డులు, ప్రైజ్‌మనీ పూర్తి వివరాలు ఇవే..

Videos

ప్లాన్ చేసి యువకుడి మర్డర్.. అక్కా చెల్లెళ్ల మాస్టర్ ప్లాన్

బ్రెజిల్ సముద్రంలో కూలిపోయిన విమానం.. పైలట్ మృతి

వంగలపూడి అనితకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసిన కన్నబాబు

టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు

తండ్రి కంటే డేంజర్.. సిగ్గు శరం ఉందా కిరణ్..

వామ్మో పెద్దపులి.. పొలాల్లో సంచారం

అమరావతి భూముల వెనుక లక్షల కోట్ల కుంభకోణం.. ఎంక్వయిరీ వేస్తే బొక్కలోకే!

మరీ ఇంత నీచమా! ఆవేదనతో రైతు చనిపోతే.. కూల్ గా కుప్పకూలాడు అని పోస్ట్

అల్లు అర్జున్ పై కక్ష సాధింపు.. చంద్రబాబు చేయిస్తున్నాడా!

స్టేజ్ పైనే ఏడ్చిన దర్శకుడు మారుతి.. ఓదార్చిన ప్రభాస్

Photos

+5

అబుదాబిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. ఫోటోలు

+5

ప్రభాస్ ది రాజాసాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌ సందడి.. ఫోటోలు

+5

బీచ్ ఒడ్డున 'కోర్ట్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మహేశ్ బాబు 'మురారి' క్లైమాక్స్ ఇలా తీశారు (ఫొటోలు)

+5

చీరలో రీసెంట్ ట్రెండింగ్ బ్యూటీ గిరిజ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్‌ కర్ణ్‌ శర్మ (ఫొటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలవులు.. కిక్కిరిసిన ఆలయ ప్రాంగణాలు.. పోటెత్తిన భక్తులు.. (చిత్రాలు)

+5

తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ శివయ్యను మీరు ఎప్పుడైనా చూశారా (ఫొటోలు)

+5

హీరోయిన్ల దుస్తులపై 'శివాజీ' కామెంట్‌.. ట్రెండింగ్‌లో 'అనసూయ' (ఫోటోలు)

+5

హెబ్బా పటేల్ ‘ఈషా’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)