Breaking News

శ్రేయాస్‌ అయ్యర్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌.. ఖవాజా మైండ్‌ బ్లాంక్‌! వీడియో వైరల్‌

Published on Sun, 02/19/2023 - 09:01

తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియా 262 పరుగులకు ఆలౌటైంది. 139 ప‌రుగుల‌కే ఏడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డ్డ భారత్‌ను అక్షర్‌ పటేల్‌(74), అశ్విన్‌(31)ను అదుకున్నారు. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 114 ప‌రుగులు జోడించారు.

ఇక కేవలం ఒక్క పరుగు ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను మొదలపెట్టిన ఆసీస్‌.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్‌ నష్టానికి 61 పరుగులు చేసింది. క్రీజులో ట్రెవిస్‌ హెడ్‌(39), మార్నస్‌ లబుషేన్‌(16) పరుగులతో ఉన్నారు. 

శ్రేయాస్‌ అయ్యర్‌ సూపర్‌ క్యాచ్‌.. 
కాగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా రాణించిన ఓపెనర్‌ ఊస్మాన్‌ ఖవాజా.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం విఫలమయ్యాడు. టీమిండియా ఆటగాడు శ్రేయాస్‌ అయ్యర్‌ సంచలన క్యాచ్‌తో ఖవాజాను పెవిలియన్‌కు పంపాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 6వ ఓవర్‌ వేసిన జడేజా బౌలింగ్‌లో ఐదో బంతికి పాడిల్‌ స్వీప్ పాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు.

ఈ ‍క్రమంలో లెగ్ గల్లీ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న అయ్యర్‌.. తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటూ, తన కుడివైపునకు వెళ్తున్న బంతిని అద్భుతంగా అందుకున్నాడు. దీంతో 6 పరుగులు చేసిన నిరాశతో పెవిలియన్‌కు చేరాడు.

ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో కూడా రివర్స్‌ షాట్‌కు ప్రయత్నించి ఖవాజా తన వికెట్‌ను కోల్పోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్‌ అద్భుతమైన సింగిల్‌ హ్యాండ్‌ క్యాచ్‌తో ఖవాజా పెవిలియన్‌ను పంపాడు.


చదవండి: నా అద్భుత ఫామ్‌కు కారణం అతడే: అక్షర్‌ పటేల్‌

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)