సవాళ్లకు మేం సిద్ధం.. శ్రేయస్‌ అయ్యర్‌ కీలక వ్యాఖ్యలు

Published on Sun, 07/26/2026 - 21:32

ఆదివారం హ‌రారే వేదిక‌గా జింబాబ్వేతో జ‌రిగిన నామ‌మాత్ర‌పు మూడో టీ20లోనూ భార‌త్ అద‌ర‌గొట్టింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జ‌ట్టును 35 ప‌రుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. దీంతో మూడు  టీ20ల సిరీస్‌ను 3-0 తేడాతో మెన్ బ్లూ క్లీన్ స్వీప్ చేసింది. 

తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 192 ప‌రుగులు చేసింది. యువ ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ(81) హాఫ్ సెంచ‌రీతో మెరిశాడు. అనంత‌రం బౌలింగ్‌లో మ‌యాంక్ యాద‌వ్ మూడు వికెట్లతో స‌త్తాచాటాడు. ఈ అద్భుత విజ‌యంపై మ్యాచ్ అనంత‌రం కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ స్పందించాడు. తమ ఆటగాళ్లపై అయ్యర్ ప్రశంసల వర్షం కురిపించాడు.

'ఈ సిరీస్‌లో మా ఆట‌గాళ్లు ఫియ‌ర్‌లెస్ క్రికెట్ ఆడారు. మూడు మ్యాచ్‌ల‌లోనూ మేము అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేశాము. కెప్టెన్‌గా ఇది నాకు మొదటి సిరీస్‌ విజయం. అందుకే ఇది నాకు చాలా ప్రత్యేకమైనది మ‌రోసారి చెబుతున్నాను.

జట్టులోని చాలామంది ఆటగాళ్లకు ఐపీఎల్‌ ఆడిన  అనుభవం ఉంది. వారు మైదానంలో స్వేచ్ఛగా ఆడేలా చూడటమే నా బాధ్యత. రాబోయే రోజుల్లో మాకు మ‌రిన్ని క‌ఠిన స‌వాళ్లు ఎదురుకానున్నాయి.

అయితే జట్టు సభ్యులు ఇదే తరహా ధైర్యాన్ని, పట్టుదలను మైదానంలో చూపిస్తే మంచి ఫలితాలు సాధించ‌వ‌చ్చు. ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచించుకుండా సానుకూల దృక్పథంతో ముందుకు సాగడమే మా సిద్దాంతం అని పోస్ట్‌ మ్యాచ్‌ ప్రెజెంటేషన్‌లో అయ్యర్‌ పేర్కొన్నాడు.

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)